6న సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: సీఎం రేవంత్‌రెడ్డి ఈ నెల 6న జిల్లా పర్యటనకు రానున్నారు. సీఎం అ య్యాక రేవంత్‌రెడ్డిది ఇదే మొదటి అధికారిక పర్యటన. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని కేశాపూర్ వద్ద భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు చే స్తున్నారు. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి, డీసీసీ అధ్యక్షుడు కాటిపల్లి నగేశ్‌రెడ్డి మంగళవారం ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఈ సభ ద్వారా ము ఖ్యమంత్రి రేవతంరెడ్డి జిల్లా అభివృద్ధికి సంబంధించి దిశానిర్దేశం చేసే కీలకమైన ప్రకటనలు చేయనున్నారన్నారు. సుమారు 50వేల మందితో సభ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. సీఎం పర్యటన చారిత్రక ఘట్టం కానుందన్నారు. ప్రజలు, కాంగ్రెస్ కా ర్యకర్తలు భారీగా హాజరై సభను విజయవంతం చే యాలని పిలుపునిచ్చారు. వారివెంట నిజామాబాద్ ఏఎంసీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, పీసీసీ డెలిగేట్ బాడ్సి శేఖర్‌గౌడ్, డీసీసీ కార్యదర్శి గడ్కోల్ భాస్కర్‌రెడ్డి, బీరెడ్డి సంతోష్‌రెడ్డి, జావెద్ అక్రమ్, కేశాపూర్, బర్థిపూర్, కంజర్, ధర్మారం సర్పంచ్‌లు గంగారెడ్డి, భాస్కర్, రాకేశ్‌యాదవ్, వాసుబాబు, యూత్ నా యకులు నరేశ్, పెంటాజీ తదితరులు ఉన్నారు.
బహిరంగ సభాస్థలిని పరిశీలించిన ఎమ్మెల్యే భూపతిరెడ్డి, డీసీసీ అధ్యక్షుడు నగేశ్‌రెడ్డి, నాయకులు
కాంగ్రెస్ శ్రేణులు భారీగా
తరలిరావాలని పిలుపు


