ఆయకట్టుకు నీరందిస్తున్నా.. నిండుకుండే! | - | Sakshi
Sakshi News home page

ఆయకట్టుకు నీరందిస్తున్నా.. నిండుకుండే!

Feb 4 2026 7:01 AM | Updated on Feb 4 2026 7:01 AM

ఆయకట్టుకు నీరందిస్తున్నా.. నిండుకుండే!

ఆయకట్టుకు నీరందిస్తున్నా.. నిండుకుండే!

రెండు విడతల్లో

6 టీఎంసీల విడుదల

అయినా కళకళలాడుతున్న

నిజాంసాగర్‌

నిజాంసాగర్‌: ఆయకట్టు కోసం ఇప్పటికే ఆరు టీ ఎంసీల నీటిని విడుదల చేసినా నిజాంసాగర్‌ ప్రా జెక్టు నిండుకుండలానే కళకళలాడుతోంది. సింగూర్‌ రిజర్వాయర్‌నుంచి నాలుగు టీఎంసీలు వచ్చి చేరడమే ఇందుకు కారణం. సంగారెడ్డి జిల్లాలోని సింగూరు ప్రాజెక్టు కరకట్ట, రివిట్‌మెంట్‌ మరమ్మతు పనులు చేపడుతుండడంతో నీటిని ఖాళీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో గతనెల 10న ప్రాజెక్టు నుంచి 5 టీఎంసీల నీటిని దిగువకు విడుదల చేశారు. గత నెల 13 నుంచి ఈనెల ఒకటో తేదీ వరకు నిజాంసాగర్‌ ప్రాజెక్టులోకి నాలుగు టీఎంసీల నీరు వచ్చి చేరింది. ఒక టీఎంసీ నీరు మంజీర నదిలో స్టోర్‌ అయ్యింది. రెండో విడతలో సింగూరు నుంచి మరో మూడు టీఎంసీల నీటిని విడుదల చేయనున్నారు.

ఆయకట్టుకు సాగునీరు..

నిజాంసాగర్‌ ప్రాజెక్టు ప్రధాన కాలువ పరిధిలో 1.5 లక్షల ఎకరాల్లో యాసంగి పంటలు సాగవుతున్నాయి. ఇప్పటికే మొదటి విడతలో నెల రోజులపాటు 3.225 టీఎంసీల నీటిని విడుదల చేశారు. రెండ దఫాలో 21 రోజుల పాటు 2.6 టీఎంసీల నీటిని వదిలారు. నీటిని వదులుతుండడంతో ప్రాజెక్టు ఖాళీ కావాల్సి ఉండగా.. సింగూరు నీరు వచ్చి చేరడంతో ప్రాజెక్టు మళ్లీ కళకళలాడుతోంది. ప్రాజెక్టు పూ ర్తిస్థాయి నీటిమట్టం 1,405 అడుగులు (17.8 టీఎంసీలు) కాగా.. మంగళవారం సాయంత్రానికి 1,403.33 అడుగుల (15.4 టీఎంసీలు) నీరు నిల్వ ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement