అధికారులు సమన్వయంతో పని చేయాలి
నిజామాబాద్ అర్బన్: సీఎం పర్యటన నేపథ్యంలో అన్నిశాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. బైపాస్ రోడ్డు ప్రాంతంలో సభ నిర్వహించనున్న ప్రాంతాన్ని సీపీ సాయిచైతన్య, జిల్లా అధికారులతో కలిసి కలెక్టర్ మంగళవారం పరిశీలించి పలు సూచనలు చేశారు. ఎలాంటి లోటుపాట్లకు తావులేకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. హెలిప్యాడ్, వేదిక తదితర వాటి ఏర్పాట్లను నిర్ణీత గడువు కన్నా ముందే పూర్తి చేయాలన్నారు. పకడ్బందీ బందోబస్తు ఏర్పాటు చేయాలని, భద్రత, వాహనాల పార్కింగ్ కోసం అనువైన స్థలాన్ని ఎంపిక చేయాలని పోలీసు అధికారులకు సూచించారు. కలెక్టర్ వెంట అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్, ట్రెయినీ కలెక్టర్ కరోలిన్ చింగ్తియాన్ మావీ, అదనపు డీసీపీ బస్వారెడ్డి, డీఆర్డీవో సాయాగౌడ్, నిజామాబాద్ ఆర్డీవో రాజేంద్రకుమార్, నగరపాలక సంస్థ కమిషనర్ దిలీప్‌కుమార్, ఆర్ అండ్ బీ ఎస్‌ఈ సర్దార్ సింగ్, ట్రాన్స్‌కో ఎస్‌ఈ రాజేశ్వర్, ఆర్టీసీ ఆర్‌ఎం జ్యోత్స్న, డీపీవో శ్రీనివాస్ రావు, డీఎంహెచ్‌వో డాక్టర్ రాజశ్రీ తదితరులు ఉన్నారు.


