ఆర్టీసీ కార్గోలో మేడారం ప్రసాదం | - | Sakshi
Sakshi News home page

ఆర్టీసీ కార్గోలో మేడారం ప్రసాదం

Jan 22 2026 8:23 AM | Updated on Jan 22 2026 8:23 AM

ఆర్టీ

ఆర్టీసీ కార్గోలో మేడారం ప్రసాదం

ఆర్మూర్‌: మేడారం జాతరకు వెళ్లలేని భక్తుల సౌకర్యార్థం ఆర్టీసీ కార్గో పార్సిల్‌ ద్వారా ముందస్తుగా బుకింగ్‌ చేసుకున్న వారికి అమ్మవారి ప్రసాదాన్ని అందజేసే కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు ఆర్మూర్‌ ఆర్టీసీ డిపో మేనేజర్‌ పీ రవి కుమార్‌ పేర్కొన్నారు. ఆర్మూర్‌ పట్టణంలోని ఆర్టీసీ డిపో కార్యాలయంలో ఈ సౌకర్యా నికి సంబంధించిన వాల్‌ పోస్టర్లను బుధవారం ఆవిష్కరించారు. భక్తులు ఆర్టీసీ కౌంటర్‌లో రూ.299 చెల్లించి బుకింగ్‌ చేసుకోవాలన్నారు. ఆర్టీసీ కార్గో పార్సిల్‌ జిల్లా ఇన్‌చార్జి కాశీరామ్‌, డిపో సిబ్బంది పాల్గొన్నారు.

కాంగ్రెస్‌ నేత

పులి శ్రీనివాస్‌కు పరామర్శ

బోధన్‌: ఎడపల్లి మండలంలోని ఏఆర్‌పీ క్యాంప్‌ గ్రామానికి చెందిన కాంగ్రెస్‌ పార్టీ మండల అధ్యక్షుడు, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు పులి శ్రీనివాస్‌ తల్లి పద్మావతి ఇటీవల మృతిచెందారు. కుటుంబ సభ్యులను ప్రభుత్వ సలహాదారు, బోధన్‌ ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డి బుధవారం పరామర్శించారు. ఎమ్మె ల్యే వెంట రాష్ట్ర ఉర్దూ అకాడమి చైర్మన్‌ తాహెర్‌బిన్‌ హందాన్‌, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ అంతిరెడ్డి రాజిరెడ్డి, బ్లాక్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు బిల్లరాంమోహన్‌, నాయకులు ఉన్నారు.

బాధిత కుటుంబాలకు..

కమ్మర్‌పల్లి: మండలంలోని చౌట్‌పల్లిలో చెర్లపల్లి గడియారం లింగంగౌడ్‌ వారం రోజుల క్రితం మృతిచెందగా ఆయన కుటుంబ సభ్యులను, ఉప్లూర్‌లో మాజీ సర్పంచ్‌ బద్దం రమేశ్‌రెడ్డి తండ్రి మృతి చెందగా కుటుంబ సభ్యులను రాజ్యసభ ఎంపీ కేఆర్‌ సురేశ్‌రెడ్డి బుధవారం పరామర్శించారు. సర్పంచ్‌ మెహబూబ్‌, నాయకులు గోపిడి లింగారెడ్డి, ఆరెల్లి నవీన్‌గౌడ్‌, మారు నర్సయ్య, కొమ్ముల రాజేశ్వర్‌, విఠల్‌, అహ్మద్‌ ఉన్నారు.

త్రిపుర రాష్ట్ర గవర్నర్‌ను కలిసిన బోధన్‌ పట్టణ ప్రముఖులు

బోధన్‌: సంక్రాంతి పండుగ సందర్భంగా ఇటీవల పట్టణ ప్రముఖులు, ప్రైవేట్‌ విద్యా సంస్థల ప్రతినిధులు, కుటుంబ సభ్యులతో కలి సి అస్సాం, మేఘాలయ, త్రిపుర రాష్ట్రాలకు విహార యాత్రకు వెళ్లారు. త్రిపుర రాష్ట్ర గవర్న ర్‌ ఇంద్రసేనా రెడ్డిని కలిసినట్లు బోధన్‌కు చెందిన సీనియర్‌ న్యాయవాది నర్సింహారెడ్డి బుధ వారం తెలిపారు. ఆ రాష్ట్ర గవర్నర్‌ తమను లోక్‌ భవన్‌కు ఆహ్వానించారని, అక్కడి పర్యా టక ప్రదేశాల విశిష్టతను వివరించారని పేర్కొన్నారు. గవర్నర్‌ను కలిసిన వారిలో ఇందూర్‌ విద్యా సంస్థల డైరెక్టర్‌ కొడాలి కిశోర్‌, వంశీ హైస్కూల్‌ ప్రిన్సిపాల్‌ విజయ్‌కుమార్‌, ఉషోదయ విద్యా సంస్థల డైరెక్టర్‌ సూర్యప్రకాశ్‌, ఎంకే చౌదరి వ్యాపార సంస్థ అధిపతి శశిభూషణ్‌, ప్రముఖులు సుబ్బారావు ఉన్నారు.

జీవాలకు టీకాలు వేయించాలి

వేల్పూర్‌: గొర్రెలు, మేకల పెంపకందారులు తమ జీవాలకు తప్పనిసరిగా అమ్మతల్లి నివార ణ టీకాలు వేయించాలని జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి గంగాధరయ్య పేర్కొన్నారు. వే ల్పూర్‌ మండలం పోచంపల్లి గ్రామంలో బుధవారం జీవాలకు నిర్వహించిన టీకాల కార్యక్రమాన్ని ఆయన తనిఖీ చేశారు. కార్యక్రమంలో మండల వెటర్నరీ వైద్యుడు సంతోష్‌రెడ్డి, ఉపసర్పంచ్‌ రాజుగౌడ్‌, పశువైద్య సిబ్బంది సురేశ్‌, గంగాధర్‌, దయానంద్‌ పాల్గొన్నారు.

మున్సిపల్‌ ఎన్నికల బరిలో సీపీఎం

ఆర్మూర్‌: మున్సిపల్‌ ఎన్నికల్లో సీపీఎం అభ్యర్థులు బరిలో ఉంటారని, పార్టీ అభ్యర్థులను స్థానిక ప్రజలు గెలిపించాలని సీపీఎం ఆర్మూర్‌ డివిజన్‌ కార్యదర్శి పల్లపు వెంకటేశ్‌ కోరారు. ఆర్మూర్‌ పట్టణంలోని సీపీఎం పార్టీ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సీపీఎం పట్టణ కార్యదర్శి కుతాడి ఎల్లయ్య, ఆర్మూర్‌ డివిజన్‌ కమిటీ సభ్యులు కొండ గంగాధర్‌, టీ భూమన్న తదితరులు పాల్గొన్నారు.

జీపీ భవనం

మంజూరు చేయాలి

పెర్కిట్‌: ఆర్మూర్‌ మండలం పల్లె(హరిపూర్‌) గ్రామానికి గ్రామ పంచాయతీ భవనాన్ని మంజూరు చేయాలని సర్పంచ్‌ పార్దెం సంజీవ్‌, కాంగ్రెస్‌ పార్టీ మండల అధ్యక్షుడు చిన్నా రెడ్డి బుధవారం పంచాయత్‌రాజ్‌ శాఖ మంత్రి సీతక్కకు వినతి పత్రం అందజేశారు. ఆర్మూర్‌ పట్టణంలో పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవానికి హాజరైన మంత్రికి ఈ సందర్భంగా నాయకులు వినతిపత్రం అందజేశారు. నూతన గ్రామ పంచాయతీగా ఏర్పాటైన పల్లెకు జీపీ భవనంతో పాటు, అంగన్‌వాడీ కేంద్రం, శ్మశాన వాటిక, ట్రాక్టర్‌ను మంజూరు చేయాలని కోరారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు రామ్‌సన్‌, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

ఆర్టీసీ కార్గోలో మేడారం ప్రసాదం 1
1/2

ఆర్టీసీ కార్గోలో మేడారం ప్రసాదం

ఆర్టీసీ కార్గోలో మేడారం ప్రసాదం 2
2/2

ఆర్టీసీ కార్గోలో మేడారం ప్రసాదం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement