రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి చేద్దాం
● గోదావరి పరీవాహక ప్రాంతానికి ప్రత్యేక గుర్తింపు
● జిల్లా ఇన్‌చార్జి మంత్రి సీతక్క
ఆర్మూర్: రాజకీయాలకు అతీతంగా పల్లెలు, పట్టణాల్లో అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించడంలో ప్రతీ ఒక్కరు భాగస్వాములు కావాలని జిల్లా ఇన్‌చార్జి మంత్రి సీతక్క అన్నారు. ఆర్మూర్ పట్టణంలో ప లు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన కార్యక్రమాన్ని పట్టణంలోని అంగడి బజార్‌లో బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆమెతో పాటు ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేశ్‌రెడ్డి హాజరై అమృత్ 2.0 కార్యక్రమానికి శంకుస్థాపన చేసారు. అనంతరం ఇన్‌చార్జి మంత్రి మాట్లాడుతూ.. ఉత్తర తెలంగాణలో నిజామాబాద్ నుంచి ఖమ్మం వరకు గోదావరి పరీవాహక ప్రాంతంగా వీరి జీవన శైలికి ప్రత్యేక గుర్తింపు ఉందన్నా రు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి ఈ నెరల 25 నుంచి 31వ తేదీ వరకు నిర్వహించనున్న మేడా రం జాతరకు భక్తులు పెద్ద ఎత్తున హాజరు కావాల ని విజ్ఞప్తి చేశారు. మేడారం జాతర అనంతరం పుష్కరాలు సైతం వస్తున్నందున గోదావరి పుష్కరాల్లో సైతం పాల్గొనాలన్నారు.
ఆర్మూర్ నియోజకవర్గ పరిధిలోని ఉమ్మెడ పుష్కర ఘాట్ వద్దకు రోడ్డు నిర్మాణం చేయాలని కోరుతూ ఎమ్మెల్యే రాకేశ్‌రెడ్డి జిల్లా ఇన్‌చార్జి మంత్రికి వినతిపత్రం అందజేశారు. నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు నిధులతో పాటు పలు పంచాయతీ రాజ్ రోడ్ల నిర్మాణాలకు సైతం నిధులు మంజూరు చేయాలని కోరారు. స్పందించిన మంత్రి సీఎంతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చా రు. తెలంగాణ రాష్ట్ర సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్‌రెడ్డి, పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి వినయ్‌రెడ్డి, ఏఎంసీ చైర్మన్ సాయిబాబా గౌడ్, నాయకులు సంజయ్ సింగ్ బబ్లు, సుంకరి రంగన్న పాల్గొన్నారు.
ఆర్మూర్‌లో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేస్తున్న జిల్లా ఇన్‌చార్జి మంత్రి సీతక్క
జిల్లా ఇన్‌చార్జి మంత్రికి వినతిపత్రం అందజేస్తున్న ఎమ్మెల్యే రాకేశ్‌రెడ్డి
రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి చేద్దాం


