ఆర్మూర్ మున్సిపల్‌పై బీజేపీ జెండా ఎగురవేస్తాం
● ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేశ్‌రెడ్డి
ఆర్మూర్: ఆర్మూర్ మున్సిపల్‌పై బీజేపీ జెండా ఎగు రవేస్తామని ఎమ్మెల్యే రాకేశ్‌రెడ్డి ధీమా వ్యక్తం చేసా రు. పట్టణంలోని ఆయన కార్యాలయంలో పలువురు నాయకులు బీజేపీలో చేరిక కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయ న మాట్లాడారు. అనంతరం ఆర్మూర్ పట్టణం మా మిడిపల్లిలోని 24వ వార్డుకు చెందిన నాగయి భోజన్న తన 70 మంది అనుచరులతో కలిసి బీజేపీలో చేరారు. వీరికి ఎమ్మెల్యే కండువా వేసి పార్టీలోకి ఆ హ్వానించారు. కార్యక్రమంలో బీజేపీ పట్టణ అధ్యక్షుడు మందుల బాలు, నాయకులు పాల్గొన్నారు.
కరపత్రాల ఆవిష్కరణ
పెర్కిట్: ఆర్మూర్ మండలం అంకాపూర్ గ్రామంలో పట్టణంలోని తెలంగాణ మైనారిటీ బాలికల గురుకుల పాఠశాల, కళాశాలకు సంబంధించిన కర పత్రాలను ఎమ్మెల్యే రాకేశ్ రెడ్డి ఆవిష్కరించారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు ప్రభుత్వం కల్పించిన సౌకర్యాలను అందజేయాలని ప్రిన్సిపాల్‌కు సూచించారు. ప్రిన్సిపాల్ వాహెదా ఫిర్దోస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. అలాగే ఆర్మూర్ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ ఆర్మూర్ నియోజకవర్గ ఇన్‌చార్జీ వినయ్ రెడ్డి కర పత్రాలను ఆవిష్కరించారు.


