రోడ్డు భద్రత నియమాలు పాటించాలి
బోధన్/ పెర్కిట్/ బోధన్‌టౌన్/ ఆర్మూర్/ నందిపేట్/ రుద్రూర్: రోడ్డు భద్రత నియమాలను ప్రతి ఒక్కరూ పాటించాలని ప్రభుత్వ సలహాదారు, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి సూచించారు. రోడ్డు భద్రత మాసోత్సవాల్లో భాగంగా బుధవారం ఎడపల్లి మండలంలోని దూపల్లి గేట్ వద్ద రోడ్డు భద్రత నిబంధనలపై నిర్వహించిన అవగాహన కార్యక్రమానికి ఎమ్మెల్యే హాజరై మాట్లాడారు. ద్విచక్రవాహనదారులు హెల్మెట్ ధరించాలన్నారు. ప్రభుత్వం అందించిన హెల్మెట్‌లను పలువురు ద్విక్రవాహనదారులకు అందించారు. రాష్ట్ర ఉర్దూ అకాడమి చైర్మన్ తాహెర్ బిన్‌హందాన్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతిరెడ్డి రాజిరెడ్డి, నగర మాజీ మేయర్ ధర్మపురి సంజయ్, బోధన్ ఏసీపీ శ్రీనివాస్, రూరల్ సీఐ విజయబాబు, ఎస్సై మచ్చేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని పెర్కిట్ శ్రీ భాషిత పాఠశాల విద్యార్థులకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు. ఆర్మూర్ ఎస్సై యాసిర్ అరాఫత్, ఎంవీఐ రాహుల్, ట్రాఫిక్ ఎస్సై రుఘుపతి, విద్యార్థులు పాల్గొన్నారు. బోధన్ పట్టణ శివారులోని పసుపువాగు, లండ్గాపూర్ యాక్సిడెంట్ స్పాట్‌ల వద్ద రోడ్డు ప్రమాదాల నివారణకు అరైవ్–అలైవ్ కార్యక్రమం నిర్వహించారు. పట్టణ సీఐ వెంకటనారాయణ, ఎస్సై భాస్కరాచారీ తదితరులు ఉన్నారు. విద్యార్థులు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కలిగి ఉండాలని ఆర్మూర్ ఎంవీఐ రాహుల్ కుమార్ సూచించారు. ఆర్మూర్ పట్టణంలోని పలు ప్రైవేటు పాఠశాలల్లో విద్యార్థులకు రోడ్డు భద్రత మాసోత్సవాల సందర్భంగా అవగాహన సదస్సు నిర్వహించారు. కార్యక్రమాల్లో ఆర్మూర్ ఎస్సై రఘుపతి, ఎంవీఐ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. నందిపేట మండల కేంద్రంలో పోలీసు శాఖ ఆధ్వర్యంలో అరైవ్ అలైవ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎస్సై శ్యామ్‌రాజ్, పోలీస్ సిబ్బంది, ప్రజలు పాల్గొన్నారు. కోటగిరి, రుద్రూర్ మండల కేంద్రాల్లో, పొతంగల్ మండలం హంగర్గా గ్రామంలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో అరైవ్ అలైవ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎస్సైలు సునీల్, సాయన్న, కోటగిరి సర్పంచ్ బర్ల మధుకర్, ఏఎంసీ చైర్మన్ హన్మంతు పాల్గొన్నారు.
రోడ్డు భద్రత నియమాలు పాటించాలి


