గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలి
● ప్రభుత్వ సలహాదారు సుదర్శన్‌రెడ్డి
రెంజల్: పార్టీలకు అతీతంగా గ్రామాలను అభివృద్ధి చేసుకోవాలని ప్రభు త్వ సలహాదారు, బోధన్ ఎమ్మెల్యే సు దర్శన్‌రెడ్డి సూచించారు. బుధవారం రెంజల్ తహసీల్ కార్యాలయంలో మండలంలోని 126 మంది లబ్ధిదారులకు మంజూరైన కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన మాటకు కట్టుబడి పని చేస్తుందని అన్నారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు మొబిన్‌ఖాన్ అద్వర్యంలో జరిగింది. మండలంలోని సర్పంచ్‌లు తిరుపతి లలిత, సుహసిని, దనుంజయ్, గయాసోద్దిన్, తెలంగాణ శంకర్, మాదవి, భానుచందర్, విజయ్, అశోక్, సుమలత, మాదవ్, మల్లేశ్, నర్సవ్వలతో పాటు తహసీల్దార్ శ్రావణ్‌కుమార్, ఎంపీడీవో కమలాకర్ తదితరులు పాల్గోన్నారు.
పాఠశాలలో మాక్ పార్లమెంట్
బోధన్‌రూరల్: మండలంలోని అమ్దాపూర్ జడ్పీహెచ్‌ఎస్ పాఠశాలలో బుధవారం మాక్ పార్లమెంట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. హెచ్‌ఎం సూర్యకుమార్, ఉపాధ్యాయులు విద్యార్థులకు పార్లమెంట్ సమావేశాలు,ప్రజాప్రతినిధుల ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు. సూర్య కుమార్, స్వప్న, శ్రీకాంత్, పద్మ అరుణ, సత్యనారాయణ, రాము, రమేశ్, ప్రకాశ్, విద్యార్ధులు పాల్గొన్నారు.


