నాణ్యమైన భోజనం అందించాలి
వేల్పూర్: విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనాన్ని అందించాలని డీఈవో అశోక్ సిబ్బందికి సూచించారు. మండలంలోని పచ్చలనడ్కుడ హైస్కూలును గురువారం ఆయన తనిఖీ చేశారు. విద్యార్థులకు వండుతున్న మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. వంట పాత్రలను చాలా శుభ్రం చేసి వండాలని నిర్వాహకులకు సూచించారు. విద్యార్థులకు నిర్వహిస్తున్న డిజిటల్ తరగతుల గురించి హెచ్‌ఎం రమేశ్‌కుమార్‌ను అడిగి తెలుసుకున్నారు. పదోతరగతి విద్యార్థుల ప్రత్యేక తరగతుల నిర్వహణపై ఆరాతీశారు. పాఠశాల నిర్వహణపై సంతృప్తి వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.
నిజామాబాద్ రూరల్: సారంగాపూర్‌లోని తెలంగాణ విశ్వవిద్యాలయం బీఈడీ కళాశాలలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ సిగ రవీందర్‌కు ‘హిందుస్థాన్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సాధించాడని అధ్యాపక సిబ్బంది గురువారం తెలిపారు. ‘కోవిడ్–2019 కాలంలో అంతర్జాతీయ, జాతీయ, ప్రాంతీయ వేబినార్‌లు, కాన్ఫరెన్స్‌లు ఈ–క్విజ్ పోటీలలో రవీందర్ పాల్గొని, 140 ఈ–సర్టిఫికెట్లను పొందారు. అభ్యసనం– విద్యా శ్రేష్టత’కు వారు చేసిన అంకిత భావానికి గుర్తింపుగా హిందుస్థాన్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం లభించింది. ఈసందర్భంగా ఆయనకు ప్రిన్సిపాల్ సాయిలు, అధ్యాపక సిబ్బంది అభినందనలు తెలిపారు.
నిజామాబాద్ లీగల్: నిర్మల్ కోర్టు పరిధిలో అడ్వకేట్ అనిల్ కుమార్ వృత్తిపరమైన విధులు నిర్వహిస్తున్న సమయంలో పోలీసు సిబ్బంది ఆయన వాహనాన్ని న్యాయస్థాన ప్రాంగణంలో ధ్వంసం చేయడం, ఆయన విధులకు అడ్డంకులు కలిగించడాన్ని న్యాయవాద పరిషత్ నిజామాబాద్ జిల్లా శాఖ తీవ్రంగా ఖండిస్తుందని పరిషత్ జిల్లా అధ్యక్షుడు మల్లెపూల జగన్మోహన్ గౌడ్ ఒక ప్రకటనలో అన్నారు. ఈ ఘటన న్యాయవాదుల గౌరవం, వృత్తి స్వాతంత్య్రంపై జరిగిన ప్రత్యక్ష దాడి వంటిదిగా భావిస్తున్నామన్నారు. అధికారులు స్పందించి సదరు పోలీసులను వెంటనే సస్పెండ్ చేయాలన్నారు. బాధిత న్యాయవాదికి న్యాయవాద పరిషత్ అండగా నిలుస్తుందన్నారు.
నాణ్యమైన భోజనం అందించాలి
నాణ్యమైన భోజనం అందించాలి


