నిధుల మంజూరుకు ప్రతిపాదనలు
బాన్సువాడ రూరల్: తిర్మలాపూర్ శివారులో నిజాంసాగర్ ప్రధాన కాలువ డిస్ట్రీబ్యూటరీ కెనాల్– 9 వద్ద ఇటీవల కురిసిన వర్షాలకు కట్టకు బుంగ పడింది. దీంతో అప్పటికప్పుడు అధికారులు తాత్కాలిక మరమ్మతులు చేయించారు. అయినా ప్రధాన కాలువకు నీరు వదిలినప్పుడల్లా లీకేజీ అవుతుండటంతో శాశ్వత మరమ్మతులు చేయించాలని అధికారులు నిర్ణయించారు. దీనిలో భాగంగా గురువారం నీటిపారుదలశాఖ ఎస్‌ఈ దక్షిణామూర్తి, ఈఈ రాజశేఖర్, డీఈఈ శ్రీచంద్ తదితరులు ప్రధాన కాలువను పరిశీలించారు. ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపించి మంజూరు రాగానే శాశ్వత మరమ్మతులు చేయిస్తామన్నారు. ఏఈలు నితిన్, గజానంద్, వర్క్ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు.


