● ఇందల్వాయి టోల్‌ప్లాజా నుంచి జిల్లాకేంద్రం వరకు ర్యాలీ
● నగరంలో బహిరంగ సభ నిర్వహణ
నిజామాబాద్‌అర్బన్/సుభాష్‌నగర్: ప్రభుత్వ సలహాదారుగా బాధ్యతలు స్వీకరించి మొదటిసారి జి ల్లాకు విచ్చేసిన బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డికి జి ల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘన స్వాగతం ల భించింది. ఇందల్వాయి టోల్‌ప్లాజా నుంచి జిల్లాకేంద్రంలోని పాత కలెక్టరేట్ మైదానం వరకు పీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్ గౌడ్, సుదర్శన్‌రెడ్డి, రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి, కార్పొరేషన్ చైర్మన్లు, నాయకులు ఓపెన్ టాప్ జీపులో ర్యాలీగా చేరుకున్నారు. అనంతరం జిల్లాకేంద్రంలో నిర్వహించిన సభలో సుదర్శన్‌రెడ్డితోపాటు పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ మాట్లాడారు. అలాగే ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ మాట్లాడుతూ.. వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే జిల్లా అన్నిరంగాల్లో అభివృద్ధి చెందిందని అన్నారు. భూపతిరెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో చేపట్టిన ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టులో భాగంగా ప్యాకేజీ 20, 21తో రూరల్ నియోజకవర్గ రైతులకు సాగునీటితో ఎంతో ప్రయోజనం చేకూరుతోందని అన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు మానాల మోహన్‌రెడ్డి, కార్పొరేషన్ చైర్మన్లు తాహెర్‌బీన్ హందాన్, ఈరవత్రి అనిల్, అన్వేష్‌రెడ్డి, ఎన్‌డీసీసీబీ చైర్మన్ కుంట రమేష్‌రెడ్డి, నుడా చైర్మన్ కేశ వేణు, మాజీ ఎమ్మెల్సీ అరికెల నర్సారెడ్డి, ఆకుల ల లిత, మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి, టీపీసీ సీ అధికార ప్రతినిధి ఏబీ శ్రీనివాస్, టీపీసీసీ ఉపాధ్యక్షుడు ముజాయిద్ ఆలం ఖాన్, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి రాంభూపాల్, బాల్కొండ, ఆర్మూర్ ని యోజకవర్గ ఇన్‌చార్జిలు సునీల్‌కుమార్, వినయ్ కుమార్‌రెడ్డి, బాడ్సి శేఖర్ గౌడ్, నగేష్‌రెడ్డి, నిజామాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, పులి శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.
మాట్లాడుతున్న రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి
మాట్లాడుతున్న ప్రభుత్వ సలహాదారుడు షబ్బీర్‌అలీ
ప్రభుత్వ సలహాదారు సుదర్శన్‌రెడ్డికి ఘన స్వాగతం
ప్రభుత్వ సలహాదారు సుదర్శన్‌రెడ్డికి ఘన స్వాగతం
ప్రభుత్వ సలహాదారు సుదర్శన్‌రెడ్డికి ఘన స్వాగతం
ప్రభుత్వ సలహాదారు సుదర్శన్‌రెడ్డికి ఘన స్వాగతం
ప్రభుత్వ సలహాదారు సుదర్శన్‌రెడ్డికి ఘన స్వాగతం
ప్రభుత్వ సలహాదారు సుదర్శన్‌రెడ్డికి ఘన స్వాగతం


