భూభారతి దరఖాస్తులను వేగంగా పరిష్కరించాలి
ఇందల్వాయి: భూభారతి పెండింగ్ దరఖాస్తులను వేగవంతంగా పరిష్కరించాలని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి సిబ్బందిని ఆదేశించారు. ఇందల్వాయి తహసీల్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. తహసీల్దార్, ఇతర సిబ్బందితో భూభారతి, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పూర్వ ప్రక్రియ అమలుపై సమీక్ష చేపట్టారు. నిర్ణీత గడువు లోగా అన్ని దరఖాస్తులు పరిష్కారమయ్యేలా చూడాలని ఆదేశించారు. భూభారతి దరఖాస్తులకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, ఆర్జీల పరిష్కారంలో జాప్యం జరుగకుండా రోజువారీగా దరఖాస్తుల పరిశీలనను పర్యవేక్షిస్తూ, వేగవంతంగా వాటిని పరిష్కరించేందుకు చిత్తశుద్ధితో కృషి చేయాలని సూచించారు. ఆయా కేటగిరిల వారిగా మ్యాపింగ్ నిర్వహిస్తున్న విధానాన్ని పరిశీలించి, బీఎల్‌వో, సూపర్‌వైజర్లు, బీఎల్‌వోలకు సూచనలు చేశారు. కలెక్టర్ వెంట తహసీల్దార్ వెంకట్‌రావు ఉన్నారు.


