సమాజాన్ని చైతన్యపరిచే రచనలు అవసరం
మాక్లూర్: సమాజాన్ని చైతన్యపరిచే రచనలు అవసరమని కేంద్ర సాహిత్య అకాడమీ తెలుగు సలహా మండలి కన్వీనర్ డాక్టర్ మృణాళిని అన్నారు. రచనలు ఎంత గొప్పగా ఉంటే సమాజంలో రచయితలకు అంత గొప్ప గౌరవం దక్కుతుందన్నారు. మండలంలోని అడవి మామిడిపల్లి శివారులోగల అపురూప వెంకటేశ్వర కల్యాణమండపంలో ఆదివారం రచయిత్రి, విద్యావేత్త డాక్టర్ అమృతలత ఆధ్వర్యంలో నెల్లుట్ల రమాదేవి సభాధ్యక్షతన అమృతలత జీవన సాఫల్య పురస్కారాల కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి మృణాళిని ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. రచనలు చేయటం ఒక ఎత్తయితే చేసిన రచనలు సమాజానికి ఎంత మేరకు ఉపయోగపడ్డాయనేది కూడ రచయిత గుర్తేరుగాలన్నారు. అనంతరం నిర్వాహకులు మృణాళిని, ప్రతిమ, రాజగోపాల్‌రావు, రాజ్యలక్ష్మి, శాంతి నారాయణ, వల్లీశ్వర్, నలిమెల భాస్కర్, వెంకటకృష్ణ, పెద్దింటి అశోక్‌కుమార్, శంకర్, లక్ష్మణ్, స్వయం ప్రకాష్, విజయ కిషన్‌రెడ్డి, కుసుమలతరెడ్డి, వసంత వివేక్, నరసింహరెడ్డి, సుజాత, సుమిలాశర్మ, బోస్కర్ ఓంప్రకాష్‌ను సన్మానించి అమృతలత జీవన సాఫల్య పురస్కారాలను అందజేశారు. కవిత దివాకర్, కాసర్ల నరేష్, బాలాజీ, కళాగోపాల్, శ్రీనివాస్, వెంకటరమణ, నాగభూషణం, తిరుపతి, కిరణ్‌బాల, శ్రీరాం, ప్రభాదేవి, నారాయణచారి, రజిత, రాజేశ్వర్, శారద హన్మాండ్లు, తారాచౌదరి, ప్రభాదేవి, కళాగోపాల్, సునిత, స్వాతి, రాజేంధర్, నరేందర్‌రెడ్డి, సురేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
వర్ని: మోస్రా మండలంలోని ఓ గ్రామంలో యువకుడు తనను ప్రేమ పేరుతో మోసం చేశాడని ఆరోపిస్తూ బాధితురాలు వర్ని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. 19 సంవత్సరాల యువకుడు తనను ప్రేమించి, పెళ్లి చేసుకోవడానికి నిరాకరించాడని ఆరోపిస్తూ ఆదివారం వర్ని పోలీస్ స్టేషన్లో బాధితురాలు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై మహేష్ తెలిపారు.
నిజామాబాద్ నాగారం: తైక్వాండో క్యూరియస్ అకాడమీ ఆధ్వర్యంలో ఆదివారం క్రీడాకారులకు బెల్టుల పరీక్ష నిర్వహించారు. కోచ్ వినోద్ నాయక్ ఆధ్వర్యంలో వైట్, ఎల్లో, రెడ్, ఆరంజ్, గ్రీన్, బ్లాక్ తదితర విభాగాల్లో పరీక్షలు నిర్వహించి క్రీడాకారులకు బెల్టులు, సర్టిఫికెట్లను అందజేశారు.అనంతరం పోటీల్లోగెలుపొందిన క్రీడాకారులను తైక్వాండో అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు అజ్మత్ ఖాన్ అభినందించారు.
నిజామాబాద్ నాగారం: హైదరాబాద్‌లో ఈ నెల 8, 9వ తేదీల్లో నిర్వహించే రాష్ట్ర పౌర హక్కుల సంఘం(సీఎల్‌సీ) తెలంగాణ రాష్ట్ర మూడవ మహాసభలను ప్రతి ఒక్కరూ విజయవంతం చేయాలని సీఎల్‌సీ ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆల్గోట్ రవీందర్ కోరారు. నగరంలోని శ్రీనగర్‌కాలనీలో ఆదివారం నిర్వహించిన కార్యక్రమంలో సభకు సంబంధించిన కరపత్రాలను నాయకులు ఆవిష్కరించారు. రాజ్యాంగం ప్రజలకు కల్పించిన హక్కులను ప్రభుత్వం అణచివేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. రాజ్యాంగంలోని 19, 21 ఆర్టికల్ ప్రకారంగా ప్రజలకు జీవించే, ప్రకటనా స్వేచ్ఛ హక్కును రక్షించుకోవాల్సిన ఆవశ్యకత ప్రజలపై ఉందన్నారు. కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా కార్యదర్శి జలేంధర్, ఉపాధ్యక్షులు గుర్రం జలంధర్, భాస్కర్ స్వామి, ప్రేమ్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.
సమాజాన్ని చైతన్యపరిచే రచనలు అవసరం
సమాజాన్ని చైతన్యపరిచే రచనలు అవసరం


