చికిత్స పొందుతూ ఒకరి మృతి
గాంధారి(ఎల్లారెడ్డి): ఆత్మహత్యకు యత్నించిన ఓ వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఎస్సై ఆంజనేయులు తెలిపిన వివరాలు ఇలా.. మండల కేంద్రానికి చెందిన ఒడుసుల చిరంజీవి(30) కొన్ని రోజులుగా మద్యానికి బానిసై ప్రతిరోజు మద్యం సేవిస్తున్నాడు. కుటుంబ సభ్యులు మద్యం మానుకోవాలని సూచించారు. దీంతో గత నెల 31న పురుగుల మందు తాగాడు. వెంటనే కుటుంబ సభ్యులు అతడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం మృతిచెందాడు. మృతుడి భార్య లక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.


