రాష్ట్ర స్థాయి వెయిట్‌ లిఫ్టింగ్‌ పోటీలకు ఎంపిక | - | Sakshi
Sakshi News home page

రాష్ట్ర స్థాయి వెయిట్‌ లిఫ్టింగ్‌ పోటీలకు ఎంపిక

Nov 1 2025 7:50 AM | Updated on Nov 1 2025 7:50 AM

రాష్ట

రాష్ట్ర స్థాయి వెయిట్‌ లిఫ్టింగ్‌ పోటీలకు ఎంపిక

రాష్ట్ర స్థాయి వెయిట్‌ లిఫ్టింగ్‌ పోటీలకు ఎంపిక గోదావరికి పోటెత్తిన భక్తులు క్యూఆర్‌ కోడ్‌తో బస్సు టికెట్‌ ఎమ్మెల్యే పోచారానికి నిరసన సెగ

సిరికొండ: రాష్ట్ర స్థాయి వెయిట్‌ లిఫ్టింగ్‌ పోటీలకు సిరికొండ జెడ్పీహెచ్‌ఎస్‌కు చెందిన ఇద్దరు విద్యార్థులు ఎంపికై నట్లు పీడీ అబ్బయ్య, పీహెచ్‌ఎం సతీశ్‌కుమార్‌ తెలిపారు. నవీపేట్‌లో నిర్వహించిన ఎంపిక పోటీల్లో ప్రతిభ కనబర్చిన జి. మణిచరణ్‌, కె. లిఖిత్‌ రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికై నట్లు పేర్కొన్నారు. వీరు ఈ నెల 2 నుంచి మహబూబాబాద్‌ జిల్లా డోర్నకల్‌లో నిర్వహించే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారని వారు తెలిపారు. జి రాకేశ్‌, సీహెచ్‌ రాజు, జి రాములు ఎంపిక పోటీల్లో మెడల్స్‌ సాధించారని తెలిపారు. పాఠశాలలో విద్యార్థులను శుక్రవారం అభినందించారు.

బాల్కొండ: కార్తీక మాసాన్ని పురస్కరించుకొని పోచంపాడ్‌లోని గోదావరికి భక్తులు శుక్రవారం పోటెత్తారు. గోదావరిలో పుణ్య స్నానాలు ఆచారించారు. అనంతరం గోదావరికి దీపాలు ముట్టించి ప్రత్యేక పూజలు చేశారు. భక్తుల సౌకర్యార్థం ఎలాంటి సౌకర్యాలను ఏర్పాటు చేయక పోవడంపై భక్తులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రాజెక్ట్‌ నుంచి గోదావరిలోకి నీటి విడుదల కొనసాగుతోంది. దీంతో గోదావరిలో నీటి ప్రవాహం ఎక్కువగా ఉంది. ఉన్నతాధికారులు స్పందించి గోదావరి వద్ద భద్రత ఏర్పాటు చేయాలని భక్తులు కోరుతున్నారు.

నిజామాబాద్‌ సిటీ: ప్రయాణికుల కోసం ఆర్టీసీ సంస్థ నూతన విధానం ప్రవేశపెట్టినట్లు రీజనల్‌ మేనేజర్‌ జ్యోత్స్న శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆధునిక సాంకేతికతను వినియోగించుకుంటూ క్యూఆర్‌ కోడ్‌ ద్వారా టికెట్ల జారీ విధానాన్ని అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రయాణికులు బస్సు ఎక్కిన తర్వాత డ్రైవర్‌ లేదా కండక్టర్‌ వద్దనున్న క్యూఆర్‌ కోడ్‌ను మొబైల్‌ నుంచి నేరుగా స్కాన్‌ చేసి టికెట్లు పొందవచ్చని తెలిపారు. ఈ సదుపాయంతో ప్రయాణికులకు సమయం ఆదాతోపాటు ఆర్థిక అవకతవకలకు అవకాశం లేకుండా పోతుందని పేర్కొన్నారు.

బాన్సువాడ రూరల్‌: మండలంలోని బోర్లం గ్రామంలో అభివృద్ధి పనులకు భూమిపూజ చేయడానికి హాజరైన బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డికి నిరసన సెగ తగిలింది. బీఆర్‌ఎస్‌ పార్టీ గ్రామ నాయకులు ప్లకార్డులు ప్రదర్శిస్తూ కార్యక్రమానికి అడ్డుకునే ప్రయత్నం చేశారు. బీఆర్‌ఎస్‌ నుంచి గెలిచి కాంగ్రెస్‌పార్టీలో చేరిన పోచారం తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. మీరు ఏ పార్టీలో ఉన్నారో చెప్పాలని, అంగన్‌వాడీ భవనం నిర్మాణం, పాఠశాల ప్రహరీ నిర్మాణం ఎప్పుడు పూర్తిచేస్తారో చెప్పాలంటూ ప్లకార్డు లు ప్రదర్శించారు. నిరసన కారులను పోలీసు లు అడ్డుకుని అరెస్టు చేశారు. నాయకులు మన్నె అనిల్‌, మమ్మాయి లక్ష్మణ్‌, బోడ చంద ర్‌, వెంకటి గంగారాం, హన్మంతు, దొంతుల నర్సింలు, రాజ్‌కుమార్‌, దివాకర్‌ ఉన్నారు.

రాష్ట్ర స్థాయి వెయిట్‌ లిఫ్టింగ్‌ పోటీలకు ఎంపిక 1
1/2

రాష్ట్ర స్థాయి వెయిట్‌ లిఫ్టింగ్‌ పోటీలకు ఎంపిక

రాష్ట్ర స్థాయి వెయిట్‌ లిఫ్టింగ్‌ పోటీలకు ఎంపిక 2
2/2

రాష్ట్ర స్థాయి వెయిట్‌ లిఫ్టింగ్‌ పోటీలకు ఎంపిక

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement