భిక్కనూరు: మండలంలోని రామేశ్వర్‌పల్లిలో ఒకరు ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్సై ఆంజనేయులు తెలిపారు. వివరాలు ఇలా.. రామేశ్వర్‌పల్లి గ్రామానికి చెందిన మల్లిని రమేష్ (35)కు అదే గ్రామానికి చెందిన అనిలతో పదహారేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఇటీవల దంపతుల మధ్య గొడవలు జరగడంతో భార్య ముగ్గురు పిల్లలను తీసుకొని పుట్టింటికి వెళ్లిపోయింది. దీంతో రమేష్ తాగుడుకు బానిసగా మారాడు. ఈనెల 24న రాత్రి మద్యం తాగి ఇంటికి వచ్చి కొద్దిసేపు ఉండి మళ్లీ బయటకు వెళ్లి, తిరిగి రాలేడు. గ్రామంలోని ఆపారం చెరువులో ఓ వ్యక్తి మృతదేహం తేలడంతో స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతుడిని రమేష్‌గా గుర్తించి, కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. భార్య కాపురానికి రాకపోవడంతో జీవితంపై విరక్తి చెంది రమేష్ ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబీకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈమేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై వివరించారు.


