లక్కు.. కిక్కు.. | - | Sakshi
Sakshi News home page

లక్కు.. కిక్కు..

Oct 28 2025 8:50 AM | Updated on Oct 28 2025 8:50 AM

లక్కు

లక్కు.. కిక్కు..

న్యూస్‌రీల్‌

నిజామాబాద్‌

రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి

అకాల వర్షాల నేపథ్యంలో జాగ్రత్తలపై అధికారులతో వీసీలో సమీక్ష

సమాజ శ్రేయస్సుకు..

బిగాల బ్రదర్స్‌ స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలు చేపట్టాలని ఎమ్మెల్యే రాకేశ్‌రెడ్డి పిలుపునిచ్చారు.

మంగళవారం శ్రీ 28 శ్రీ అక్టోబర్‌ శ్రీ 2025

– 8లో u

లక్కీడ్రాలో

టోకెన్‌ తీసి

చూపిస్తున్న

కలెక్టర్‌

వినయ్‌కృష్ణారెడ్డి

పాఠశాల నిర్వహణ

గ్రాంట్‌ విడుదల

కమ్మర్‌పల్లి: జిల్లాలోని ప్రభుత్వ పాఠశాల నిర్వహణ గ్రాంట్‌ను అధికారులు విడుదల చేశారు. రాష్ట్ర సమగ్ర శిక్ష అభి యాన్‌ కింద ప్రభుత్వ పాఠశాలల నిర్వహణకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసినప్పటికీ, విద్యాశాఖ అధికారుల అలసత్వం కారణంగా హెచ్‌ఎం బ్యాంక్‌ ఖాతాలో డబ్బులు జ మ కాలేదని ‘నిర్వహణ భారం’ పేరిట సాక్షి జిల్లా పేజీలో సోమవారం కథనం ప్రచురితమైంది. ఈ కథనానికి అధికార యంత్రాంగం స్పందించింది. స్టేట్‌ ప్రాజెక్ట్‌ ఆఫీసర్‌ నుంచి డిస్ట్రిక్ట్‌ ప్రాజెక్ట్‌ ఆఫీసర్‌కు రూ. 29,74,42500 గ్రాంటు విడుదల చేశారు. త్వరలోనే ప్రతి ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయుడి బ్యాంక్‌ ఖాతాలో గ్రాంటును జమ చేయనున్నారు.

నేటితో ముగియనున్న దరఖాస్తుల గడువు

ఆర్టీసీ డ్రైవర్‌, శ్రామిక్‌ పోస్టులకు..

నిజామాబాద్‌ సిటీ: టీఎస్‌ ఆర్టీసీలో డ్రైవర్‌, శ్రామిక్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తుల గడువు మంగళవారంతో ముగియనుంది. సంస్థలో వెయ్యి డ్రైవర్‌ ఉద్యోగాలు, 800 శ్రామిక్‌ (క్లీనర్‌) పోస్టులను భర్తీచేయనున్నారు. ఈ ఉద్యోగాల కోసం అభ్యర్థులు సమీప బస్‌ డి పోల్లో దరఖాస్తు చేసుకోవాలి. డ్రైవర్‌ పోస్టు కు 22 నుంచి 35 ఏళ్ల వయోపరిమితి, శ్రామి క్‌ ఉద్యోగానికి 18 నుంచి 30 ఏళ్ల మధ్య వ యస్సువారు అర్హులు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈ బీసీలకు చెందిన అభ్యర్థులకు 5 ఏళ్ల మినహాయింపు ఉంది. డ్రైవర్లకు హెవీ మోటారు వెహికిల్‌ డ్రైవింగ్‌ లైసెన్సు పొంది ఉండాలి.

నేడు నగరంలో

కరెంట్‌ కోత

సుభాష్‌నగర్‌: నగరంలోని పలు ప్రాంతాల్లో మంగళవారం విద్యుత్‌ సరఫరాలో అంతరాయం ఉండనున్నట్లు ఏడీఈ ఆర్‌ చంద్రశేఖర్‌ ఒక ప్రకటనలో తెలిపారు. విద్యుత్‌ తీగల మరమ్మతులు, లైన్ల పెంపు పనులు నిర్వహించనుండటంతో కరెంట్‌ కోత ఉండనున్నట్లు పేర్కొన్నారు. గాయత్రినగర్‌, ఆకుల పాపన్న రోడ్‌, పుట్ట మైసమ్మ, విశ్వ వికాస్‌ స్కూల్‌, కాశీనగర్‌, సాయిప్రియనగర్‌, చింతచెట్టు మైసమ్మ, బీమరాయ టెంపుల్‌ ప్రాంతంలో నేడు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు విద్యుత్‌ సరఫరా నిలిపి వేస్తున్నామని, విద్యుత్‌ వినియోగదారులు సహకరించాలని ఆయన కోరారు.

గోదావరిలోకి

నీటి విడుదల

బాల్కొండ: ఎస్సారెస్పీలోకి ఎగువ ప్రాంతాల నుంచి పోమవారం ఉదయం మళ్లీ వరద పెరగడంతో ప్రాజెక్ట్‌ నుంచి గోదావరిలోకి నీటి విడుదలను ప్రారంభించారు. ఎగువ ప్రాంతాల నుంచి 22,154 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతోంది. ప్రాజెక్ట్‌ నుంచి 4 వరద గేట్ల ద్వారా 12500 క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి వదులుతున్నారు. కాకతీయ కాలువ ద్వారా 3 వేల క్యూసెక్కులు, ఎస్కేప్‌ గేట్ల ద్వారా 5 వేలు, సరస్వతి కాలువ ద్వారా 650, లక్ష్మికాలువ ద్వారా 200, ఆవిరి రూపంలో 573, మిషన్‌ భగీరథ ద్వారా 231 క్యూసెక్కుల నీరు పోతోంది. ప్రాజెక్ట్‌ పూర్తి స్థాయి నీటి మట్టం 1091(80.5 టీఎంసీలు) అడుగులు కాగా సోమవారం సాయంత్రానికి ప్రాజెక్ట్‌లో అంతే స్థాయి నీటి మట్టంతో ప్రాజెక్ట్‌ నిండుకుండలా ఉంది.

టోకెన్‌లను డబ్బాలో వేసి దరఖాస్తుదారులకు చూపుతున్న ఎక్సైజ్‌ అధికారి

నిజామాబాద్‌అర్బన్‌: 2025–27 నూతన మద్యం పాలసీలో భాగంగా జిల్లాలో దుకాణాల కేటాయింపు ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. నగర శివారులోని భారతీ గార్డెన్‌లో సోమవారం లాటరీ పద్దతిలో వైన్‌ షాపుల కేటాయింపునకు లక్కీ డ్రా నిర్వహించారు. కలెక్టర్‌ వినయ్‌ కృష్ణారెడ్డి నేతృత్వంలో కట్టుదిట్టమైన ఏర్పాట్ల నడుమ ఎలాంటి అవాంతరాలకు తావులేకుండా సాఫీగా ఈ ప్రక్రియ కొనసాగింది.

102 దుకాణాలు.. 2786 దరఖాస్తులు

మద్యం దుకాణాల లైసెన్సుల జారీ కోసం జిల్లా ఎక్సైజ్‌ శాఖ గత నెల 24 నుంచి ఈనెల 23 వరకు దరఖాస్తులు స్వీకరించారు. జిల్లాలోని 102 మద్యం షాపులకు గాను మొత్తం 2786 దరఖాస్తులు దాఖలయ్యాయి. గతంలో కంటే ఈ ఏడాది తక్కువ దరఖాస్తులు వచ్చాయి. ఒక్కో షాపు వారీగా దాఖలైన దరఖాస్తులకు సంబంధించిన వారిని ఆహ్వానిస్తూ, వారి సమక్షంలో కలెక్టర్‌ లక్కీ డ్రా తీస్తూ మద్యం దుకాణాల కేటాయింపును ఖరారు చేశారు. లక్కీ డ్రా కోసం వినియోగించిన టోకెన్‌లను అందరికీ చూపిస్తూ, పారదర్శకంగా డ్రా నిర్వహించారు. డ్రా ప్రక్రియ ప్రారంభం నుంచి చివరి వరకు ఫొటో, వీడియో చిత్రీకరణ చేశారు. పెద్ద సంఖ్యలో దరఖాస్తుదారు లు హాజరు కావడంతో టోకెన్‌ కలిగి ఉన్న వారినే లోనికి అనుమతించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా కట్టుదిట్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. సీపీ సాయి చైతన్య పోలీసు బందోబస్తును పర్యవేక్షించి, అధికారులకు పలు సూచనలు చేశారు. లక్కీడ్రాలో వైన్‌ షాపులు కేటాయించబడిన వారు లైసెన్స్‌ ఫీజు రూపేణా నిర్ణీత రుసుము చెల్లించేందుకు వీలుగా వేదిక వద్దనే అవసరమైన ఏర్పాట్లు చేశారు. ఎకై ్సజ్‌ డిప్యూటీ కమిషనర్‌ సోమిరెడ్డి, సూపరింటెండెంట్‌ మల్లారెడ్డి తదితరులు ఉన్నారు.

ముగిసిన మద్యం దుకాణాల

కేటాయింపు ప్రక్రియ

లక్కీ డ్రా ద్వారా ఎంపిక చేసిన కలెక్టర్‌ వినయ్‌ కృష్ణారెడ్డి

పకడ్బందీ ఏర్పాట్లు చేసిన అధికారులు

మద్యం దుకాణాల కేటాయింపు ప్రక్రియ ముగియడంతో లక్కీ డ్రాలో లక్కు–కిక్కు వరించిందెవరికో తెలిసిపోయింది. జిల్లాలోని 102 మద్యం దుకాణాలను డ్రా పద్ధతిలో కలెక్టర్‌ వినయ్‌ కృష్ణారెడ్డి కేటాయించారు. నగరంలో జరిగిన ఈ కార్యక్రమానికి దరఖాస్తుదారులు భారీగా తరలివచ్చారు. పోలీసులు, అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేయడంతో ప్రశాంతంగా ప్రక్రియ ముగిసింది.

భార్యాభర్తలకు..

బాల్కొండలో సోమిరెడ్డి లక్ష్మణరావు 67వ షాపుకు దరఖాస్తు చేసుకోగా లక్కీ డ్రాలో అతనికి షాపు లభించింది. అతడి భార్య సోమిరెడ్డి కృష్ణవేణి పేరిట 69వ దుకాణాన్ని దరఖాస్తు చేసుకోగా అక్కడ కూడా డ్రా గెలిచారు. భార్యాభర్తలకు అదే ప్రాంతంలో రెండు చోట్ల మద్యం దుకాణాలు రావడంతో వారు హర్షం వ్యక్తం చేశారు. రెంజల్‌ మండలంలో రాంపూర్‌, సాటాపూర్‌ ప్రాంతాలలో ఆవుల నాగార్జున రెడ్డికి రెండు దుకాణాలు (52, 54) లక్కీ డ్రాలో కేటాయించబడ్డాయి. అలాగే ఏర్గట్ల్లకు అత్యధికంగా 96 దరఖాస్తులు రాగా పోటాపోటీ నెలకొంది. కాగా గతంలో మద్యం దుకాణం నిర్వహించిన అనుగు శ్రీధర్‌కు మళ్లీ లక్కీ డ్రాలో మద్యం షాపు వరించడం నిజంగా లక్కే.

విజేతల్లో 19మంది మహిళలు..

మద్యం దుకాణాల కేటాయింపు లక్కీ డ్రాలో 19 మద్యం దుకాణాలు మహిళలకు దక్కాయి. జిల్లా వ్యాప్తంగా 102 మద్యం దుకాణాలకు లక్కీ డ్రా తీయగా ఇందులో 19 మంది మహిళలు ఉన్నారు. కొత్త మద్యం దుకాణాలు ఈ ఏడాది డిసెంబర్‌ 1 నుంచి నవంబర్‌ 30, 2027 వరకు కాలపరిమితి ఉన్నట్లు జిల్లా ఎకై ్సజ్‌ శాఖ సూపరింటెండెంట్‌ మల్లారెడ్డి తెలిపారు.

రైతులు నష్టపోకుండా చూడాలి

లక్కు.. కిక్కు..1
1/6

లక్కు.. కిక్కు..

లక్కు.. కిక్కు..2
2/6

లక్కు.. కిక్కు..

లక్కు.. కిక్కు..3
3/6

లక్కు.. కిక్కు..

లక్కు.. కిక్కు..4
4/6

లక్కు.. కిక్కు..

లక్కు.. కిక్కు..5
5/6

లక్కు.. కిక్కు..

లక్కు.. కిక్కు..6
6/6

లక్కు.. కిక్కు..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement