కనుల పండువగా పల్లకీ సేవ
నిజామాబాద్‌అర్బన్: తుపాను ప్రభావం వల్ల రానున్న మూడు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు చేసిన నేపథ్యంలో రైతులకు నష్టం వాటిల్లకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి అధికారులను ఆదేశించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్ సోమవారం సబ్ కలెక్టర్లు, ఆర్డీవో, తహసీల్దార్లతో సమీక్ష నిర్వహించారు. కొనుగోలు కేంద్రాలకు రైతులు తరలించిన ధాన్యం నిల్వలతోపాటు ఆయా ప్రాంతాల్లో ఆరబెట్టిన పంటలు వర్షానికి తడవకుండ రైతులకు టార్పాలిన్లను అందుబాటులో ఉంచాలన్నారు. రానున్న మూడు రోజుల పాటు అవసరమైతే వరి కోతలు జరపకుండా రైతులకు క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించాలన్నారు. కాగా, కొనుగోలు కేంద్రాల నుంచి మిల్లులకు ధాన్యం పంపిన వెంటనే దిగుమతి చేసుకునేలా పర్యవేక్షణ జరపాలని, వెంటవెంటనే ట్రక్ షీట్లు తెప్పించుకుని ట్యాబ్ ఎంట్రీలు చేయించాలని ఆదేశించారు.
కాగా, ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ సూచించారు. బీఎల్‌వో సూపర్‌వైజర్లు ఎస్‌ఐఆర్ ప్రక్రియను నిర్దిష్ట గడువు లోపు పకడ్బందీగా జరిపించాలన్నారు. అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్, సబ్ కలెక్టర్లు వికాస్ మహతో, అభిగ్యాన్ మాల్వియ, కిరణ్మయి, నగర పాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, ఆర్డీవో రాజేంద్రకుమార్, బీఎల్‌వో సూపర్‌వైజర్లు, బీఎల్‌వోలు, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.
కమ్మర్‌పల్లి(భీమ్‌గల్): భీమ్‌గల్ నింబాచలం(లింబాద్రి గుట్ట) బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా సోమవా రం లక్ష్మీనరసింహస్వామి పల్లకీ సేవను భక్తులు కనుల పండువగా నిర్వహించారు. అంతకుముందు గ్రామాలయంలో ఉత్సవమూర్తులకు లింబాద్రిగుట్ట పురోహితులు శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజ లు నిర్వహించారు. పుష్పాలంకృతుడైన లక్ష్మీనరసింహస్వామిని పల్లకీలో కొండపైకి చేర్చారు. పట్టణంలోని నందిగల్లీ, నందీశ్వరాలయం, హరిజనవాడ, ముచ్కూర్ రోడ్, పురాణీపేట్ మీదుగా పల్లకీసేవ సాగింది. ఈసందర్భంగా భక్తుల కోలాటాలు వీక్షకులను అలరించాయి.
కనుల పండువగా పల్లకీ సేవ
కనుల పండువగా పల్లకీ సేవ


