ధాన్యం కొనుగోళ్లను సమర్థవంతంగా నిర్వహించాలి
నిజామాబాద్‌అర్బన్: ధాన్యం కొనుగోలు ప్రక్రియ ను సమర్థవంతంగా నిర్వహించాలని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సూచించారు. హైదరాబాద్ నుంచి సోమవా రం ఆయన రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రాష్ట్ర ప్ర భుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావులతో కలి సి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లా కలెక్ట ర్లు, అదనపు కలెక్టర్లు, జిల్లా పౌరసరఫరాలు, వ్య వసాయ, గ్రామీణ అభివృద్ధి, రవాణా శాఖల అధికా రులతో ధాన్యం, కొనుగోళ్లు, అకాల వర్షాల నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి మాట్లాడుతూ.. తుపాను ప్రభావంతో భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నందున వరి, పత్తి కొనుగోలు ప్రక్రియకు ఎలాంటి అవాంతరాలు ఏ ర్పడకుండా తగిన చర్యలు తీసుకోవాలన్నారు. అ నంతరం మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ.. తుపాను తీవ్రత అధికంగా ఉన్నందున అధి కార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి మాట్లాడుతూ.. ప్ర భుత్వ నిబంధనల ప్రకారం జిల్లాలో వరి, మొక్కజొన్న కొనుగోళ్లు చేపట్టినట్లు తెలిపారు. సోయాబీన్ రైతుల సౌకర్యార్థం మంగళవారం 12 కొనుగోలు కేంద్రాలను ప్రారంభించేలా చర్యలు తీసుకున్నామ న్నారు. కేంద్రాల్లో రైతులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామన్నారు. వీసీలో అదనపు కలెక్టర్ కిరణ్ కు మార్, సంబంధిత శాఖల అధికారులు ఉన్నారు.


