శివాలయాల్లో ప్రత్యేక పూజలు
నిజామాబాద్ రూరల్: కార్తీక మాసం తొలి సోమ వారం సందర్భంగా భక్తులు శివాలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. నగరంలోని నీలకంఠేశ్వర, శంభు లింగేశ్వర, ఉమామహేశ్వర, కోటగల్లిలోని భక్తమార్కండేయ ఆలయాల్లో, లలితా దేవి ఆశ్రమాలయం, జన్మభూమి రోడ్డు వద్ద ఉన్న శివాలయాల్లో భక్తులు అభిషేకాలు, విశేష పూజలు నిర్వహించారు. నీలకంఠేశ్వరాలయంలో ఉదయం నుంచి భక్తుల సందడి నెలకొంది. సాయంత్రం పిండి దీపాలను వెలిగించి మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులతో ఆలయాలు సందడిగా మారాయి. కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణ అధికారి శ్రీరామ రవీందర్, ఆలయ కమిటీ చైర్మన్ సిరిగిరి తిరుపతి, కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
శంభు లింగేశ్వర ఆలయంలో స్వామి వారికి ప్రత్యేక పూజలు, అభిషేక పూజలు నిర్వహించారు. భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి ఎన్.రాములు, చైర్మన్ బింగి మధు, కిశోర్, కమిటీ సభ్యులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.
శివాలయాల్లో ప్రత్యేక పూజలు


