బంగారు దుకాణంలో చోరీ
నవీపేట: మండల కేంద్రంలోని పోలీస్‌స్టేషన్ ఎదురుగా ఉన్న వైష్ణవి బంగారు దుకాణంలో దొంగలు ఆదివారం అర్ధరాత్రి బీభత్సం సష్టించారు. నల్లని దుస్తులు, మాస్కులు ధరించిన ముగ్గురు దుండగులు పల్సర్ బైక్‌పై వచ్చి ఈ దొంగతనానికి పాల్పడ్డారు. దుకాణానికి ఇరువైపులా ఉన్న నివాస గృహాలకు గొలుసులు వేశారు. దుకాణం ముందు భాగంలోని ఇనుప గేటుకు వేసిన తాళాలను ఎలక్ట్రిక్ కట్టర్‌తో కట్ చేశారు. ఇద్దరు దుండగులు లోపలికి ప్రవేశించి లోపల ఉన్న వెండి, బంగారు ఆభరణాలను దోచుకెళ్లారు. అదే ప్రాంతంలో అద్దెకు ఉన్న బిహారి కూలీలు దొంగతనం జరుగుతున్నట్లు గుర్తించి వారిపై రాళ్లు విసిరారు. ఈ చోరీలో రూ.10 లక్షల విలువైన వెండి, బంగారు ఆభరణాలను దుండగులు చోరీకి పాల్పడినట్లు దుకాణ యజమాని పవన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సెంట్రల్ క్రైమ్ సెల్ ఏసీపీ నాగేంద్ర చారి, సీఐ సాయినాథ్, నార్త్ రూరల్ సీఐ శ్రీనివాస్, ఎస్సై తిరుపతి ఘటన స్థలాన్ని, సీసీ ఫుటేజీలను పరిశీలించారు. బాధితుడు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు నార్త్ రూరల్ సీఐ శ్రీనివాస్ తెలిపారు.


