ప్రభుత్వ పథకాలపై ప్రజల్లో విశేష స్పందన
● కాంగ్రెస్ పార్టీ తెలంగాణ వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్, పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్‌గౌడ్
హైదరాబాద్‌లో మాట్లాడుతున్న కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ , పాల్గొన్న నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి, నాయకులు
నిజామాబాద్‌రూరల్: ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలపై ప్రజల్లో విశేష స్పందన లభిస్తోందని కాంగ్రెస్ పార్టీ తెలంగాణ వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్, పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్‌గౌడ్ అన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి భారీ మెజార్టీతో విజయం సాధించడం ఖాయమని వారు అన్నారు. సోమవారం హైదరాబాద్‌లోని టూరిజం ప్లాజాలో ఉప ఎన్నికల నేపథ్యంలో మంత్రి జూపల్లి కృష్ణారావు అధ్యక్షతన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. సమావేశంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావు, పొన్నం ప్రభాకర్, వివేక్ వెంకటస్వామి, రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.
ప్రభుత్వ పథకాలపై ప్రజల్లో విశేష స్పందన
ప్రభుత్వ పథకాలపై ప్రజల్లో విశేష స్పందన


