గడ్డిమందు డబ్బాలో నీళ్లు పోసి తాగిన చిన్నారులు
● చికిత్స అందిస్తున్న వైద్యులు
రాజంపేట:ఖాళీగా ఉన్న గడ్డిమందు డబ్బాలో చిన్నారులు నీళ్లు పోసి తాగిన ఘటన మండలంలోని అన్నారం తండాలో చోటుచేసుకుంది. వివరాలు ఇలా.. తండాకు చెందిన సరోజ–వికాస్ దంపతుల కుమారుడ్ విగ్నేష్ (6), శ్రీను–లలిత దంపతుల కుమారులు ప్రజ్వల్(6), శ్రీజన్(4) ముగ్గురు కలిసి శనివారం ఇంటి ముందు ఆవరణలో ఆడుకుంటున్నారు. ఈక్రమంలో ఓ ఇంటి ముందు పంట పొలానికి సంబందించిన గడ్డిమందు ఖాళీ డబ్బాలు కనిపించాయి. దీంతో ముగ్గురు చిన్నారులు ఆ డబ్బాలను తీసుకొని వాటిలో నీటిని పోసి తాగారు. వెంటనే కుటుంబ సభ్యులు గమనించి, వారిని చికిత్స నిమిత్తం కామారెడ్డి ఏరియా ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం పిల్లల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు గ్రామస్తుల ద్వారా తెలిసింది.
నిజామాబాద్‌అర్బన్: నగరంలోని గంజ్ మార్కెట్‌లో గుర్తు తెలియని మహిళ మృతదేహం లభ్యమైనట్లు ఒకటో టౌన్ ఎస్‌హెచ్‌వో రఘుపతి తెలిపారు. గంజ్ మార్కెట్‌లోని గోల్డ్ షాపు వద్ద మహిళ మృతదేహం ఉండటంతో స్థానికులు గుర్తించి, పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే వారు ఘటన స్థలానికి చేరుకొని, పరిశీలన చేశారు. మృతురాలి వద్ద ఎలాంటి ఆధారాలు లభించలేవని పోలీసులు తెలిపారు. ఆమె వయస్సు సుమారు 45–50 ఏళ్లు ఉంటాయన్నారు. మెరున్ కలర్ ప్లవర్స్ డిజైన్ సారీ, ఎరుపు రంగు స్వెటర్ ధరించిఉందన్నారు. ఎడమ చేయిపైన గంగమ్మ అని పచ్చబొట్టు ఉందన్నారు. మృతురాలి వివరాలు ఎవరికై న తెలిస్తే 87126 59714 నంబర్‌కు సమాచారం ఇవ్వాలని పోలీసులు కోరారు.


