రమణీయ ప్రకృతి
నిర్వహణ భారం
కమ్మర్‌పల్లి: పాఠశాల నిర్వహణ గ్రాంట్ల వ్యవహా రం ‘దేవుడు వరమిచ్చినా పూజారి కరుణించ లేదు’ అన్న చందంగా మారింది. పాఠశాలలు ప్రారంభమైన ఐదు నెలలకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజారు చేసినప్పటికీ విద్యాశాఖ అధికారుల అల సత్వం కారణంగా ప్రధానాపాధ్యాయుల ఖాతాల్లో ఇప్పటి వరకు డబ్బులు జమ కాలేదు. దీంతో చాక్‌పీస్‌లు కొందామన్నా పైసలు లేని పరిస్థితి ఉంది. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పన, చిన్నచిన్న మరమ్మతులను పట్టించుకోవడమే మరిచారు. జిల్లాలో ప్రస్తుతం 122 ప్రాథమిక, 633 ప్రాథమికోన్నత, 263 ఉన్నత పాఠశాలలు ఉండగా.. 1.04 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. ఈ విద్యాసంవత్సరం జిల్లాలో 3 వేల మంది విద్యార్థుల అడ్మిషన్లు అదనంగా పెరిగాయి.
పాఠశాలల అభివద్దికి కృషిచేస్తున్నామని ప్రభుత్వం చెబుతున్నా ఆచరణలో మాత్రం కనిపించడం లేదు. ఈ నెల 10న రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తూ ఉతర్వులు జారీ చేసినప్పటికీ విద్యాశాఖ అధికారుల నిర్లక్ష్యం వల్ల ఇంకా నిధులు ప్రధానోపాధ్యాయుల ఖాతాలో జమకాలేదు. మరోపక్క 81 పాఠశాల కాంప్లెక్స్‌లకు రావలసిన రూ. 26.73 లక్షలు, అలాగే 33 ఎమ్మార్సీలకు రావలసిన రూ. 26.40 లక్షలు ఇంకా రాలేదు.
ఎరుపు వర్ణంలోకి మారిన ఆకాశం.. ఆకుపచ్చ తివాచీ పరుచుకున్నట్లుగా ఉన్న నేల ప్రకృతి ప్రేమికులను మంత్రముగ్దులను చేసింది. సూర్యాస్తమయం వేళ భూమ్యాకాశాలు చూపరులను ఆకట్టుకుంటుండగా పచ్చని చెట్లు సాక్షులుగా నిలిచినట్లు ఉన్న ఈ రమణీయ దృశ్యాన్ని డొంకేశ్వర్ శివారులో ‘సాక్షి’ ఆదివారం సాయంత్రం క్లిక్‌మనిపించింది. చల్లని సాయంకాలం ఆహ్లాదాన్ని నింపింది.
– డొంకేశ్వర్(ఆర్మూర్)
ఖర్చుల భారం
పాఠశాలలకు నిధుల
మంజూరు ఇలా..
ఇంకా విడుదల కాని పాఠశాల గ్రాంట్లు
ఇబ్బందులు పడుతున్న
ప్రధానోపాధ్యాయులు
చాక్ పీస్‌ల కొనుగోలు..
పారిశుద్ధ్య నిర్వహణకు తిప్పలు
కష్టమవుతోంది
ప్రభుత్వ పాఠశాలకు వచ్చే నిధులు సకాలంలో రాక పాఠశాల నిర్వహణ కష్టమవుతోంది. పాఠశాల ప్రారంభమై ఐదు నెలలు గడిచినా మొదటి విడత నిధులు కూడా రాలేదు. ప్రభుత్వం నిధులను వెంటనే విడుదల చేయాలి.
– సురేశ్, గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుడు
నిధులను పెంచాలి
ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలలకు ఇస్తున్న నిధులు సరిపోవడం లేదు. విద్యార్థుల సంఖ్య పరంగా కాకుండా ప్రతి ప్రాథమిక పాఠశాలకు ఏడాదికి రూ.50 వేలు కేటాయించాలి. విద్యార్థుల సంఖ్య 100 దాటితే లక్ష రూపాయలు కేటాయించాలి.
– రచ్చ మురళి, పీఎస్‌హెచ్‌ఎంఏ
రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
పాఠశాల విద్యా సంవత్సరం సగం గడిచిపోనప్పటికీ మొదటి విడత గ్రాంట్ హెచ్‌ఎంల ఖా తాల్లో జమకాలేదు. దీంతో ప్రధానోపాధ్యాయులకు ఖర్చులు తలకు మించిన భారమవుతున్నా యి. సొంత డబ్బులు వెచ్చించి స్టేషనరీ, శానిటైజర్లు, చాక్‌పీస్‌లు, ఫినాయిల్ తదితర సామగ్రి కొనుగోలు చేస్తున్నారు. పాఠశాలల్లో చిన్న చిన్న మరమ్మతులకు నిధులు లేక ఖర్చు చేయలేని పరిస్థితి నెలకొంది. అలాగే కాంప్లెక్స్ పాఠశాలలకు వచ్చే గ్రాంట్ రాక కాంప్లెక్స్ సమావేశాల నిర్వహణ ప్రధానోపాధ్యాయులకు అదనపు ఆర్థిక భారంగా మారింది. అలాగే ఎమ్మార్సీలకు కూడా రావాల్సిన నిధులు రాక కంప్యూటర్ నిర్వహణ ఖర్చులు, విద్యుత్ బిల్లులు, గుండు సూది నుంచి తెల్ల కాగితాల వరకు కొనుగోలు ఖర్చులు ఎంఈవోలకు భారంగా మారాయి.
రమణీయ ప్రకృతి
రమణీయ ప్రకృతి
రమణీయ ప్రకృతి


