తెలంగాణ అంటేనే ఆత్మగౌరవం
నిజామాబాద్ అర్బన్: తెలంగాణ అంటేనే ఆ త్మగౌరవమని.. అవకాశం, అధికారం ఆత్మగౌరవమే తమ విధానమని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. ఆదివారం ఓ ప్రైవేట్ హోటల్‌లో ఆమె మీ డియాతో మాట్లాడారు. తెలంగాణలో అందరికీ మంచి జరగాలని ‘జనంబాట’ పట్టామన్నారు. ప్రజా సమస్యలు పరిష్కారం కావడమే ముఖ్యమని, అవసరమైతే రాజకీయపార్టీ పెడతామన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో తనను ఎమ్మెల్యేలే ఓడించారని ఆరోపించారు. ఆడబిడ్డలకు సీఎం రేవంత్‌రెడ్డి అన్యాయం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అందరికీ సమాన అవకాశాలు లేకుండా ప్రభుత్వం అణచివేస్తోందని, ఎన్నో సామాజిక వర్గాలు ఉన్నప్పటికీ అధికారంలో వాటా కొన్ని వర్గాలే అనుభవిస్తున్నాయన్నారు. అధికారంలో మహిళల వాటా ఐదు శాతం కూడా లేదన్నారు. కీలక నిర్ణయాలు తీసుకునే స్థానంలో ఎస్సీ, ఎస్టీ, యువత, మహిళలకు భాగస్వామ్యం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
ముంపు రైతులకు
పరిహారం ఇవ్వాలి
గోదావరి వరద ముంపు ప్రాంతమైన యంచ గ్రామం పరిధిలో పంట పొలాలను తాము పరిశీలించామని, అక్కడి పరిస్థితి దారుణంగా ఉందని కవిత అన్నారు. పంట నష్టపోయిన రైతులకు రూ.50 వేల చొప్పున పరిహారం ఇవ్వాలన్నారు. నవీపేట మండలంలోని 5వేల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని పేర్కొన్నారు. మక్కలకు బోనస్ ఇస్తామని ప్రకటించి ఇవ్వడం లేదన్నారు. కొనుగోలు కేంద్రాలను ప్రారంభించకపోవడమే మక్కరైతులు పంట దిగుబడిని ప్రైవేట్ వ్యాపారులకు విక్రయిస్తున్నారన్నారు. అలాగే జిల్లాలో బీడీ కార్మికులకు జరుగుతున్న అన్యాయంపై కాంగ్రెస్, బీజేపీ ఎమ్మెల్యేలు కొట్లాడాలన్నారు. సమావేశంలో జాగృతి నాయకులు తదితరులు పాల్గొన్నారు.
సామాజిక తెలంగాణ సాధన ద్వారానే అది సాధ్యం
ఆడబిడ్డలకు సీఎం రేవంత్
అన్యాయం చేస్తున్నారు
పార్లమెంట్ ఎన్నికల్లో
ఎమ్మెల్యేలే నన్ను ఓడించారు
మీడియాతో తెలంగాణ జాగృతి
అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత


