ఆధునిక హంగులతో అందమైన భవనం..
● రూ. 5.70 కోట్ల వ్యయంతో
మాక్లూర్‌లో నిర్మాణం
● నేడు ప్రారంభించనున్న కలెక్టర్, ఎమ్మెల్యే
మాక్లూర్: మండల కేంద్రంలో రూ.5 కోట్ల 70 లక్షలతో నిర్మించిన ప్రభుత్వ ఉన్నత పాఠశాల భవనాన్ని ఆదివారం ప్రారంభించనున్నారు. ఈ మేరకు ఉమ్మడి జిల్లా ఈఈ ప్రతాప్, స్థానిక ఎంఈవో సత్యనారాయణ తో కలిసి జిల్లా విద్యాధికారి అశోక్ ఆదివారం నూతన భవనాన్ని పరిశీలించారు. కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేశ్‌రెడ్డి ముఖ్యఅతిథులుగా హాజరై నూతన భవనాన్ని సోమవారం ప్రారంభించనున్నారు.
భవన నిర్మాణానికి ప్రభుత్వం రూ. 4 కోట్ల 70 లక్షలు మంజూరు చేయగా, మాక్లూర్ వాసి, నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే బిగాల గణేశ్‌గుప్తా, ఆయన సొదరుడు మహేశ్‌గుప్తా కలిసి రూ.కోటి విరాళం అందజేశారు. మొత్తం రూ.5 కోట్ల 70 లక్షలతో అన్ని సౌకర్యాలు కల్పిస్తూ నూతన భవనాన్ని నిర్మించారు.


