కానిస్టేబుళ్లకు పదోన్నతి
నిజామాబాద్ అర్బన్: పోలీస్ కమిషనరేట్ పరిధిలో పలువురు కానిస్టేబుళ్లకు హెడ్‌కానిస్టేబుళ్లుగా పదోన్నతి లభించింది. వరప్రసాద్, సీహెచ్‌శేఖర్ (కమ్మర్‌పల్లి), శ్రీనివాస్(భీమ్‌గల్), కే యాదవ్(మాక్లూర్), ఎండీ ఆరిఫుద్దీన్(టూ టౌన్), చిన్నయ్య(కోటగి రి), జి శ్రీనివాస్‌రావు(నవీపేట), లింబాద్రి, రాంచందర్(రెంజల్), గణేశ్(నిజామాబాద్ రూరల్) ప్రమోషన్‌లు పొందినవారిలో ఉన్నారు. పదోన్నతి పొందిన వారిని జగిత్యాల జిల్లాకు కేటాయించారు.
ఫీజు చెల్లింపు
గడువు పొడిగింపు
తెయూ(డిచ్‌పల్లి): తెలంగాణ యూనివర్సిటీ పరిధిలోని డిగ్రీ పరీక్షల ఫీజు చెల్లింపు గడువును నవంబర్ 4వ తేదీ వరకు పొడిగించినట్లు కంట్రోలర్ ప్రొఫెసర్ కే సంపత్‌కుమా ర్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. డి గ్రీ 1, 3, 5వ సెమిస్టర్ రెగ్యులర్, 2, 4, 6వ సెమిస్టర్ బ్యాక్‌లాగ్ (2021, 2022, 2023, 2024 బ్యాచ్)లకు చెందిన విద్యార్థులు పరీక్ష ఫీజు చెల్లించాలని ఆయన సూచించారు. రూ.100 అపరాధ రుసుముతో నవంబర్ 6వ తేదీ వరకు ఫీజు చెల్లించే అవకాశం ఉంటుందని తెలిపారు. పూర్తి వివరాల కోసం www. telanganauniversity.ac.in వెబ్‌సైట్ ను సంప్రదించాలని సూచించారు.
రీవాల్యూయేషన్‌కు
దరఖాస్తు చేసుకోండి..
తెలంగాణ యూనివర్సిటీ పరిధిలోని 2021వ బ్యాచ్ బీఈడీ, బీపీఎడ్ 1, 2, 3, 4, 5, 6వ సెమిస్టర్ రెగ్యులర్, బ్యాక్‌లాగ్ థియ రీ పరీక్షల ఫలితాల రీవాల్యూయేషన్ కోసం నవంబర్ 3వ తేదీ వరకు దరఖాస్తు చేసు కోవాలని కంట్రోలర్ ప్రొఫెసర్ కే సంపత్‌కుమార్ సూచించారు. ఒక్కో పేపర్‌కు రూ.500, దరఖాస్తు పత్రానికి రూ.25 చెల్లించాలని పేర్కొన్నారు. పూర్తి వివరాలకు తెలంగాణ యూనివర్సిటీ వెబ్‌సైట్ www.telanganauniversity.ac.in ను సంప్రదించాలని సూచించారు.
నింబాచల బ్రహ్మోత్సవాలు ప్రారంభం
కమ్మర్‌పల్లి(భీమ్‌గల్): జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన భీమ్‌గల్ నింబాచలం(లింబాద్రి గుట్ట) బ్రహ్మోత్సవాలు ఆదివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. కార్తీక మాసంలో 13 రోజులపాటు సాగనున్న బ్రహ్మోత్సవాల్లో మొదటి రోజు గుట్టపై నుంచి నంబి వంశస్తులు, గ్రామస్తులు మంగళ వాయిద్యాలు, మేళాతాళలతో గ్రామాలయానికి ఊరేగింపుగా వెళ్లారు. క్షేత్రదేవి చండికా దేవీ(పెద్దంగంటి ఎల్లమ్మతల్లి)కి పురోహితులు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి సారె సమర్పించారు. గ్రామ పెద్దలు, జాతర నిర్వహణ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
బెస్ట్ అటెండెన్స్ స్కూల్‌గా బెజ్జోర జెడ్పీహెచ్‌ఎస్
కమ్మర్‌పల్లి(భీమ్‌గల్): రాష్ట్రంలో ఉత్తమ హాజరు(అటెండెన్స్) పాఠశాలగా భీమ్‌గల్ మండలం బెజ్జోర జెడ్పీహెచ్‌ఎస్ నిలిచింది. ఫేషియల్ రికగ్నిషన్ సిస్టంలో 2025–26 వి ద్యా సంవత్సరానికి గాను గెజిటెడ్ హెడ్‌మాస్టర్స్ విభాగంలో విద్యార్థులు, ఉపాధ్యాయుల హాజరు అధికంగా ఉండడంతో బెజ్జోర పాఠశాలను డైరెక్టర్ స్కూల్ ఎడ్యుకేషన్ ఎంపిక చేశారు. ఆదివారం హైదరాబాద్‌లోని మర్రి చెన్నారెడ్డి మానవ అభివృద్ధి వనరుల కేంద్రంలో నిర్వహించిన కార్యక్రమంలో బెజ్జోర జెడ్పీహెచ్‌ఎస్ గెజిటెడ్ హెచ్‌ఎం ఎండీ హఫీజొద్దీన్‌ను ఎస్‌సీఈఆర్‌టీ డైరెక్టర్ రమేశ్, ఆర్‌జేడీ సత్యనారాయణరెడ్డి సన్మానించి ప్రశంసాపత్రం అందజేశారు.
కానిస్టేబుళ్లకు పదోన్నతి


