ఆనంద్ రవి, దివి లీడ్ రోల్స్ చేసిన డిఫరెంట్ హారర్ మూవీ ‘నెపోలియన్ రిటర్న్స్.
ఆనంద్ రవి దర్శకుడు. భోగేంద్రగుప్త నిర్మాత. ప్రస్తుతం ఈ సినిమా నిర్మాణ దశలో ఉంది.
ఆదివారం హైదరాబాద్‌లో ఈ సినిమా టైటిల్, గ్లింప్స్ లాంచ్ ఈవెంట్‌ని నిర్వహించారు.
దర్శకులు వశిష్ట, సాయిరాజేశ్, నిర్మాత వంశీ నందిపాటి, అనిల్ విశ్వంత్ అతిథులుగా హాజరై చిత్ర బృందానికి శుభాకాంక్షలు అందించారు.


