
ప్రజా సంక్షేమాన్ని వదిలేసి కక్ష సాధింపు చర్యలు
ఏపీలోని చంద్రబాబు సర్కార్ పత్రికా స్వేచ్ఛపై దాడికి పాల్పడుతోంది. ఉద్దేశపూర్వకంగానే సాక్షి మీడియాపై కక్ష సాధింపు చర్యలకు దిగుతోంది. ఇది పత్రికా స్వేచ్ఛపై జరుగుతున్న దాడి. ప్రజా సంక్షేమాన్ని గాలికొదిలేసిన కూటమి ప్రభుత్వం నిజాలు రాస్తున్న సాక్షి ఎడిటర్ ధనంజయ రెడ్డిపై అక్రమ కేసులు, విచారణ పేరుతో వేధించడం, పత్రిక కార్యాలయంలో పోలీసులు హంగామా సృష్టించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. – జి ప్రమోద్ గౌడ్, స్టేట్ కౌన్సిల్ మెంబర్, తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్