
ఎస్‌హెచ్‌జీలకు మరిన్ని కొనుగోలు కేంద్రాలు
విజయవంతంగా నిర్వహించాలి
● సాఫీగా కొనుగోళ్లు చేపట్టడంతోనే..
● యాసంగి కన్నా
ఈ సారి 37 కేంద్రాలు అధికం
మోర్తాడ్(బాల్కొండ):మహిళా సంఘాలకు వరి ధా న్యం కొనుగోలు బాధ్యతను విస్తృతం చేశారు. గత యాసంగి సీజన్న్‌కన్నా ఈసారి 37 కొనుగోలు కేంద్రాలను పెంచారు. జిల్లాలోని మహిళా సంఘాలు గతంలో 224 కేంద్రాల ద్వారా వరి ధాన్యాన్ని సేకరించాయి.అయితే జిల్లా వ్యాప్తంగా ఈసారి మొత్తం 676 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయగా, అందులో మహిళా సమాఖ్యలకు 261 కేంద్రాలను అ ప్పగిస్తూ అధికార యంత్రాంగం నిర్ణయించింది. గ్రామ సమాఖ్యలను ఆర్థికంగా బలోపేతం చేస్తూ వారిని వ్యాపార రంగం వైపు ప్రోత్సహించేందుకు ధాన్యం కొనుగోళ్లను అప్పగిస్తున్నారు.
మహిళా సంఘాలకు బ్యాంకు లింకేజీ, సీ్త్రనిధి రుణాలు ఇవ్వడ, వసూలు చేయడంతో ఆశించిన ప్రయోజనం చేకూ రడం లేదని ప్రభుత్వం భావిస్తోంది. వ్యాపారం వైపు మహిళల దృష్టిని మరలిస్తే వారు ఆర్థికంగా నిలదొక్కుకుంటారని గుర్తించిన ప్రభుత్వం వరి కొనుగోలు కేంద్రాలకు ప్రాధాన్యం కల్పించింది.
మహిళా సమాఖ్యల ఆధ్వర్యంలోని కొనుగోలు కేంద్రాల ద్వారా మహిళలు విజయవంతంగా వరి ధాన్యాన్ని సేకరించాలి. లక్ష్యానికి అనుగుణంగా వడ్లు కొనుగోలు చేసి లాభాలు గడించాలి. మహిళా సంఘాలు బలపడితేనే సభ్యులకు ప్రయోజనం.
– సాయాగౌడ్, పీడీ, గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ