
బోధన్ ఎకై ్సజ్ సర్కిల్ పరిధిలో 422 దరఖాస్తులు
బోధన్‌టౌన్(బోధన్): బోధన్ ఎక్సైజ్ సర్కిల్ కార్యాలయ పరిధిలోని 18 మద్యం దుకాణాలకు శనివారం రాత్రి 10 గంటల వరకు 422 దరఖాస్తులు వచ్చినట్లు సీఐ భాస్కర్‌రావ్ తెలిపారు. ఈ నెల 23న లక్కీడ్రా నిర్వహిస్తామని, డిసెంబర్ 1 నుంచి కొత్త మద్యం దుకాణాలు ప్రారంభమవుతాయని సీఐ వెల్లడించారు.
రాజంపేట: మండలంలోని పెద్దాయిపల్లి గ్రామ శివారులోని గుట్ట నుంచి మొరం అక్రమ రవాణా చేస్తున్న పలువురిపై కేసు నమోదు చేసి తొమ్మిది ట్రాక్టర్లను సీజ్ చేసినట్లు ఎస్సై రాజు శనివారం తెలిపారు. అనుమతి లేకుండా ఇసుక, మొరం రవాణా చేస్తే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
నిజామాబాద్ రూరల్: భారత సంచార్ నిగం లిమిటెడ్ (బీఎస్‌ఎన్‌ఎల్) వినియోగదారులకు దీపావళి పండగ బొనాంజాను ప్రకటించిందని జిల్లా జీఎం వెంకటేశ్వర్లు తెలిపారు. ఒక్క రూపాయితోనే 30 రోజులపాటు అపరిమిత ఉచిత వాయిస్ కాల్స్, రోజుకు 2జీబీ డేటా 100 ఎస్‌ఎంఎస్‌లు లభిస్తాయ ని పేర్కొన్నారు. వచ్చే నెల 15వ తేదీ వరకు ఉచితంగా సిమ్‌కార్డు అందజేయనున్నట్లు తెలిపారు. ఈ నెల 18, 19, 20 తేదీల్లో బీఎస్‌ఎన్‌ఎల్ సెల్ఫ్ కేర్ యాప్, వెబ్‌సైట్ ద్వారా రూ.100 అంతకంటే ఎక్కువ రీచార్జ్ చేసుకునే పది మందిని లక్కీ డిప్ ద్వారా ఎంచుకొని ఒక్కొక్కరికి 10 గ్రాముల సిల్వర్ కాయిన్‌ను బహుమతిగా ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని బీఎస్‌ఎన్‌ఎల్ వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలని జీఎం కోరారు.
సుభాష్‌నగర్: కానిస్టేబుల్ ప్రమోద్‌పై కత్తితో దాడి చేసి ప్రాణాలు తీసిన నిందితుడు రియాజ్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేశ్ పటేల్ కులాచారి శనివారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. ఈ ఘటన చాలా బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రమోద్ మృతి పట్ల వారి కుటుంబసభ్యులకు సంతాపం ప్రకటించారు.
కానిస్టేబుల్ హత్యపై
మానాల దిగ్భ్రాంతి
నిజామాబాద్ సిటీ: చోరీ కేసులో పోలీస్ స్టేషన్‌కు తీసుకువస్తున్న కానిస్టేబుల్ ప్రమోద్‌ను నిందితుడు రియాజ్ కత్తితో పొడిచి హత్య చేసిన ఘటన తనను తీవ్రంగా దిగ్భ్రాంతికి గురిచేసిందని డీసీసీ అధ్యక్షుడు, రాష్ట్ర సహకా ర సంఘం లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్‌రెడ్డి శ నివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ ఘటనకు కారకులను ఎ ట్టి పరిస్థితుల్లో ఉపేక్షించవద్దని, నిందితుడిని కఠినంగా శిక్షించాలని సీపీ సాయిచైతన్యను కోరారు. మృతుడి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.