స్కూటీని ఢీకొన్న లారీ | - | Sakshi
Sakshi News home page

స్కూటీని ఢీకొన్న లారీ

Oct 19 2025 6:49 AM | Updated on Oct 19 2025 6:49 AM

స్కూట

స్కూటీని ఢీకొన్న లారీ

చేపలవేటకు వెళ్లి విద్యుత్‌ షాక్‌తో ఒకరు..

రిటైర్డ్‌ వీఆర్వో దుర్మరణం

కామారెడ్డి క్రైం: అదుపుతప్పిన లారీ స్కూటీని ఢీకొన్న ఘటనలో ఒకరు దుర్మరణం పాలయ్యారు. ఈ ఘటన జిల్లా కేంద్రంలోని పోలీస్‌స్టేషన్‌ ఎదురుగా శనివారం ఉదయం జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. పట్టణంలోని ఎన్‌జీవోస్‌ కాలనీకి చెందిన రిటైర్డ్‌ వీఆర్వో జనార్దన్‌ రావు వ్యక్తిగత పనుల మీద స్కూటీపై వెళ్తున్నాడు. అదే సమయంలో వెనుక నుంచి వచ్చిన లారీ అదుపుతప్పి స్కూటీని ఢీకొంది. ఈ ప్రమాదంలో జనార్దన్‌రావుకు తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు, స్థానికులు ఆయనను జనరల్‌ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ కొద్దిసేపటికే మృతి చెందాడు. ఇసాయిపేటకు చెందిన ఆయన కొంతకాలంగా కుటుంబంతో కలిసి కామారెడ్డిలోని ఎన్జీవోస్‌ కాలనీలో స్థిరపడ్డారు. మృతుడికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.

లింగంపేట(ఎల్లారెడ్డి): మండలంలోని భవానీపేట గ్రామానికి చెందిన బ్యాగరి రాజయ్య(52) చేపలవేటకు వెళ్లి విద్యుత్‌ షాక్‌తో మృతి చెందినట్లు ఎస్సై దీపక్‌కుమార్‌ తెలిపారు. గ్రామశివారులోని పెద్దవాగు మడుగులో శనివారం విద్యుత్‌ తీగల సహాయంతో చేపలను పట్టేందుకు స్టార్టర్‌ బాక్సులోని ఫ్యూజ్‌కు వైరు పెట్టి నీటిలో దిగుతున్న క్రమంలో షాక్‌ తగిలి రాజయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. గ్రామస్తులు మృతదేహాన్ని గుర్తించి మృతుడి సోదరి లక్ష్మికి సమాచారం ఇచ్చారు. లక్ష్మి ఫిర్యాదు మేరకు ఘటనా స్థలానికి పోలీసులు చేరుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

రోడ్డు ప్రమాదంలో యువకుడు..

సదాశివనగర్‌(ఎల్లారెడ్డి): మండలంలోని పద్మాజివాడి గ్రామ శివారులోని స్ప్రింగ్‌ ఫీల్డ్స్‌ స్కూల్‌ సమీపంలో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందాడు. వివరాలు ఇలా ఉన్నాయి. గాంధారి మండల కేంద్రానికి చెందిన కామెల్లి అరవింద్‌ స్వామి(29) సదాశివనగర్‌ మండల కేంద్రంలోని అత్తగారి ఇంటికి వచ్చి భార్యాపిల్లలను చూసి తిరిగి ద్విచక్ర వాహనంపై గాంధారికి వెళ్తున్నాడు. ముందు వెళ్తున్న కారును ఓవర్‌టేక్‌ చేసి వెళ్తూ ఎదురుగా వస్తున్న హైచర్‌ వ్యాన్‌ను ఢీకొట్టాడు. దీంతో తీవ్రంగా గాయపడిన స్వామిని కామారెడ్డి ఏరియా ఆస్పత్రికి తరలించేలోగా మృతి చెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. మృతుడి తండ్రి నర్సింహులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై పుష్పరాజ్‌ తెలిపారు.

చికిత్స పొందుతూ మాజీ ఎంపీటీసీ..

ఇందల్వాయి: మండలంలోని తిర్మన్‌పల్లి మాజీ ఎంపీటీసీ జంగిడి లక్ష్మి(61) ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం మధ్యాహ్నం మృతి చెందినట్లు ఎస్సై సందీప్‌ తెలిపారు. 15 రోజుల క్రితం లక్ష్మి పురుగుల మందు సేవించింది. విషయం తెలిసిన ఆమె చెల్లెలు వెంటనే అక్కను చికిత్స నిమిత్తం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ లక్ష్మి శనివారం మృతి చెందారు. కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకురాలైన జంగిడి లక్ష్మి మృతి పార్టీకి తీరని లోటని మండల నాయకులు సంతాపం వ్యక్తం చేశారు.

స్కూటీని ఢీకొన్న లారీ 1
1/2

స్కూటీని ఢీకొన్న లారీ

స్కూటీని ఢీకొన్న లారీ 2
2/2

స్కూటీని ఢీకొన్న లారీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement