
నిర్లక్ష్యానికి తావిస్తే చర్యలు తప్పవు
● ఆయిల్ పామ్ సాగు లక్ష్యాన్ని
సాధించాలి
● కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి
నిజామాబాద్‌అర్బన్: జిల్లాలో నిర్దేశిత లక్ష్యం మేర కు ఆయిల్ పామ్ సాగు జరిగేలా అంకిత భావంతో కృషి చేయాలని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి సూచించారు. జిల్లా వ్యాప్తంగా ఈ ఏడాది 3,500 ఎకరాల విస్తీర్ణంలో ఆయిల్ పామ్ సాగు చేయాలని లక్ష్యం కాగా, ఆ దిశగా రైతులను ప్రోత్సహించాలన్నారు. కలెక్టరేట్‌లో శనివారం వ్యవసాయ, ఉద్యానవన శాఖల అధికారులు, ఆయిల్ పామ్ నర్సరీ నిర్వాహకులైన ప్రీ యునిక్ కంపెనీ ప్రతినిధులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఆయిల్ పామ్ సాగు పురోగతిపై క్లస్టర్ల వారీగా వివరాలు అడిగి తెలుసుకున్నారు. లక్ష్య సాధనలో వెనుకబడి ఉన్న క్లస్టర్ల అధి కారుల పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆయి ల్ పామ్ సాగును ప్రోత్సహించడంలో విఫలమవుతున్న అధికారులపై తగు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఒప్పందానికి అనుగుణంగా కృషి చేయని పక్షంలో ప్రయివే టు కంపెనీపై కూడా చర్యలు తీసుకునే అంశాలను పరిశీలించాలని కలెక్టర్ సూచించారు. జిల్లాలో రైతు లు ఆయిల్ పామ్ సాగు చేపట్టేలా విస్తృత స్థాయిలో అవగాహన కల్పించాలని పదేపదే సూచిస్తున్నప్పటికీ ఎందుకు పురోగతి సాధించలేకపోతున్నారని ప్రశ్నించారు. సాగుకు ప్రస్తుత సమయం ఎంతో అనుకూలమని, రైతులను ప్రోత్సహించేందుకు ప్ర భుత్వం అందిస్తున్న రాయితీలు, మద్దతు ధర, సుధీర్ఘకాలంపాటు ఏటేటా సమకూరే రాబడి తదితర అంశాలను వివరించాలని సూచించారు. సమావేశంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి జె.గోవిందు, జిల్లా ఉద్యానవన శాఖ అధికారి శ్రీనివాస్, ప్రీ యూనిక్ కంపెనీ ప్రతినిధులు, ఆయా క్లస్టర్ల ఉద్యా నవన శాఖ అధికారులు పాల్గొన్నారు.