
పసుపు పరిశోధన కేంద్రం సందర్శన
కమ్మర్‌పల్లి: మండల కేంద్రంలోని పసుపు పరిశోధన కేంద్రాన్ని వరంగల్ స్పైస్ బోర్డు ఆధ్వర్యంలో నేక్కొండ, కేసముద్రం, చింతపల్లి, ఒడిశా ప్రాంత రైతులు గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా పరిశోధన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ మహేందర్ పసుపు రకాలు, యంత్రాలు, పరిశోధనలపై పవర్ పాయింట్ ప్రజేంటేషన్ ద్వారా వివరించారు.
మనోహరాబాద్‌లో పసుపు పరిశ్రమ..
జక్రాన్‌పల్లి : మండలంలోని మనోహరాబాద్‌లో ఉ న్న పసుపు రైతుల ఉత్పత్తిదారుల సంఘం పరిశ్రమ ను వరంగల్ జిల్లా రైతులు గురువారం సందర్శించారు. జాతీయ పసుపు బోర్డు ,స్పైసెస్ బోర్డు వరంగల్ సంయుక్తంగా నిర్వహించిన పసుపు రైతుల విజ్ఞానయాత్రలో భాగంగా వరంగల్ జిల్లా నేకొండా ఎఫ్‌పీసీఎల్, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, ఒడిశా రాష్ట్రాలకు చెందిన 40 మంది రైతులు జేఏం కేపీఏం ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీ లిమిటెడ్‌ను సందర్శించారు. కార్యక్రమంలో జేఎంకేపీఎం సూపర్‌వైజర్ రుత్విక్, స్పైసెస్ బోర్డు అసిస్టెంట్ డైరెక్టర్ జ్యోతిష్, సిబ్బంది వెంకటేశ్, మాధవ్, సంస్థ చైర్మన్ తిరుపతిరెడ్డి, డైరెక్టర్ సంతోష్ రెడ్డి పాల్గొన్నారు .
నిజామాబాద్‌నాగారం: తెలంగాణ రాష్ట్ర జిమ్నాస్టిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 18న జాతీయస్థాయి టోర్నీకి రాష్ట్ర బృందం ఎంపిక పోటీలు నిర్వహిస్తున్నట్లు అసోసియేషన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కిరణ్‌రెడ్డి, స్వామి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. హైదరాబాద్‌లోని ది గార్డియన్ స్కూల్‌లో తెలంగాణ రాష్ట్ర ఆర్టిస్ట్ జిమ్నాస్టిక్స్ క్రీడాకారుల ఎంపిక జరుగుతుందన్నారు. ఎంపికై న క్రీడాకారులు నవంబర్ 6 నుంచి 9 వరకు ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో నిర్వహించే జాతీయస్థాయి టోర్నీలో పాల్గొంటారని తెలిపారు. ఆసక్తి గల క్రీడాకారులు 9849193002 నెంబర్‌లో సంప్రదించాలని తెలిపారు.