
బీవోఎస్ చైర్మన్‌గా ప్రొఫెసర్ రవీందర్‌రెడ్డి
తెయూ(డిచ్‌పల్లి): తెలంగాణ యూనివర్సిటీలో పలు విభాగాలకు చైర్మన్, డీన్, సమన్వయకర్తలను నియమిస్తూ వీసీ ప్రొఫెసర్ యాదగిరిరావు ఆదేశాలు జారీ చేశారు. అర్థశాస్త్ర విభాగం బోర్డ్ ఆఫ్ చైర్మన్ (బీవోఎస్)గా ప్రొఫెసర్ రవీందర్‌రెడ్డి నియామకం అయ్యారు. అర్ధశాస్త్ర విభాగంలో 17 సంవత్సరాల బోధన, పరిశోధన అనుభవం ఉండటంతోపాటు ఎన్‌ఎస్‌ఎస్ కోఆర్డినేటర్, పలు అకడమిక్, అడ్మినిస్ట్రేటివ్ పదవులను సమర్థవంతంగా నిర్వహించారు. అర్థశాస్త్ర విభాగాధిపతిగా ఎన్.స్వప్న నియామకమయ్యారు. అర్థశాస్త్ర విభాగంలో స్వప్నకు 12 సంవత్సరాల బోధన, పరిశోధన అనుభవం ఉంది. ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఎస్ యూనిట్–1 ప్రోగ్రాం ఆఫీసర్‌గా కొనసాగుతున్నారు. వర్సిటీ ఎన్‌ఎస్‌ఎస్ విభాగం సమన్వయకర్త (కోఆర్డినేటర్)గా ప్రొఫెసర్ కే అపర్ణ నియమితులయ్యారు. అపర్ణ వర్సిటీలో పలు అకడమిక్, అడ్మినిస్ట్రేటివ్ పదవులను సమర్థవంతంగా నిర్వహించారు. రవీందర్‌రెడ్డి, స్వప్న, అపర్ణలకు వీసీ యాదగిరి రావు, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ యాదగిరి నియామక ఉత్తర్వులను అందజేశారు. తమపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన వీసీ, రిజిస్ట్రార్‌లకు వారు కృతజ్ఞతలు తెలిపారు.

బీవోఎస్ చైర్మన్‌గా ప్రొఫెసర్ రవీందర్‌రెడ్డి

బీవోఎస్ చైర్మన్‌గా ప్రొఫెసర్ రవీందర్‌రెడ్డి