
స్థానిక ఎన్నికలకు సిద్ధం
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు మొదటి విడత జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు నిర్వహించేందుకు నోటిఫికేషన్ జారీకి అన్ని ఏర్పాట్లు పూర్తిచేశామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి తెలిపారు.
బుధవారం రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని హైదరాబాద్ నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లు, పోలీస్ కమిషనర్లు, ఎస్పీలు, ఎన్నికల అధికారులతో మొదటి విడత జెడ్పీటీసీ, ఎంపీ టీసీ ఎన్నికల నోటిఫికేషన్, నామినేషన్ల ప్రక్రియపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పోలీస్ కమిషనర్ సాయి చైతన్యతో కలిసి కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో మొదటి విడతలో 9న నిజామాబాద్, బోధన్ రెవెన్యూ డివిజన్ల పరిధిలోని 18 జెడ్పీటీసీలు, 177 ఎంపీటీసీ స్థానాలకు సంబంధించిన ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేసేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఆర్‌వోలు, ఏఆర్‌వోలకు శిక్షణ ఇచ్చామన్నారు. నామినేషన్ల స్వీకరణకు అన్ని చర్యలు తీసుకున్నామని, ఎఫ్‌ఎస్‌టీ, ఎస్‌ఎస్‌టీ బృందాలను నియమించామని పేర్కొన్నారు.
తొలి విడతలో బోధన్, చందూర్, కోటగిరి, మోస్రా, పోతంగల్, రెంజల్, రుద్రూర్, సాలూర, వర్ని, ఎడపల్లి, ధర్పల్లి, డిచ్‌పల్లి, ఇందల్వాయి, మాక్లూర్, మోపాల్, నవీపేట్, నిజామాబాద్, సిరికొండ జెడ్పీటీసీ స్థానాలతోపాటు, పై మండలాల పరిధిలోని 177 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికల నోటిఫికేషన్ జారీచేస్తామని కలెక్టర్ తెలిపారు.
ఆర్‌వోలు, ఎంపీడీవోలతో టెలీ కాన్ఫరెన్స్
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ వీడియో కాన్ఫరెన్స్ అనంతరం కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి రిటర్నింగ్ అధికారులు, ఎంపీడీవోలతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ తొలి విడ త ఎన్నికల నోటిఫికేషన్ జారీ, నామినేషన్ల స్వీకరణ ప్రక్రియలను ప్రశాంత వాతావరణంలో పకడ్బందీగా నిర్వహించాలని ఆదేశించారు. రా ష్ట్ర ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలను అనుసరిస్తూ ఎన్నికల ప్రక్రియ నిర్వహించాలని, ఎ లాంటి పొరపాట్లకు తావులేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని మార్గనిర్దేశం చేశారు. నామినేష న్ల స్వీకరణ కేంద్రాల్లో హెల్ప్‌డెస్క్‌లను ఏర్పాటు చేసుకోవాలన్నారు. అన్ని మండలాల్లో ఎస్‌ఎస్‌టీ, ఎఫ్‌ఎస్‌టీ బృందాలను ఏర్పాటు చేసు కుని ఎన్నికల ప్రవర్తనా నియమావళి పక్కాగా అమలయ్యేలా పర్యవేక్షించాలని సూచించారు. పోస్టర్లు, బ్యానర్లు, గోడలపై రాతలను తొలగింప జేయాలని అన్నారు. నామినేషన్ల స్వీకరణ ప్రక్రియలో నిబంధనలను పాటించాలని, రిటర్నింగ్ అధికారులు నామినేషన్ ఫారాలు, రిజిస్టర్లు సక్రమంగా నిర్వహించాలని తెలిపారు. సీసీ కెమెరాలు, గోడ గడియారాలు, ఓటర్ల జా బితా నిర్వహణ సక్రమంగా ఉండాలని, నామినేషన్ల సమయంలో వీడియోగ్రఫీ కచ్చితంగా ఉండాలన్నారు. నామినేషన్ సమయంలో అభ్యర్థులు సమర్పించాల్సిన అఫిడవిట్లు, ధ్రువపత్రాలు, ఇతర ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలని సూచించారు. టెలీ కాన్ఫరెన్స్‌లో అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్, ట్రెయినీ డిప్యూటీ కలెక్టర్ సందీప్, జెడ్పీ సీఈవో సాయాగౌడ్, డీపీవో శ్రీనివాస్ పాల్గొన్నారు.
మొదటి విడత నోటిఫికేషన్‌కు
ఏర్పాట్లు పూర్తి
కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని వీడియో కాన్ఫరెన్స్