
ఆనకట్టపై మక్కల ఆరబోత
బాల్కొండ: ఆరుగాలం శ్రమించి పండించిన మక్క పంటల ఆరబోత రైతులకు ఇబ్బందికరమవుతోంది. నూర్పిళ్ల అనంతరం వర్షాలు వెంటాడుతుండటంతో మక్కలను ఆరబెట్టేందుకు కల్లాలు, రోడ్లు సరిపోవడం లేదు. దీంతో రైతులు ఎస్సారెస్పీ ఆనకట్టను ఆశ్రయిస్తున్నారు. ముప్కాల్, నల్లూర్, కొత్తపల్లి, బస్సాపూర్, సోన్‌పేట్ తదితర గ్రామాలకు చెందిన రైతులు మక్కలను ఆరబెట్టేందుకు సుమారు 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆనకట్ట వరకు తరలిస్తున్నారు. అయితే, మక్కల ఆరబోతతో పర్యాటకులకు కొంత మేర ఇబ్బంది కలిగినా అన్నదాతల అవస్థలను దృష్టిలో ఉంచుకొని సర్దుకుపోతున్నారు.