
స్కానింగ్ సెంటర్లపై నిఘా ఉచాలి
నిజామాబాద్‌నాగారం: స్కానింగ్ కేంద్రాల పనితీరుపై నిరంతర నిఘా ఉంచాలని అధికారులను, సలహా సంఘ సభ్యులను జిల్లా వైద్యారోగ్యశాఖాధికారిణి రాజశ్రీ ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని వైద్యారోగ్యశాఖ కార్యాలయంలో గర్భస్థ పూర్వ, గర్భస్థ పిండ లింగ నిర్ధారణ పరీక్షల నిషేధ చట్టం జిల్లా స్థాయి సలహా సంఘ సమావేశాన్ని సోమ వారం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్‌వో మాట్లాడుతూ.. ప్రతి స్కానింగ్ కేంద్రాన్ని తప్పుకుండా మూడు నెలలకోసారి తనీఖీ చేయాలన్నారు. రిజిస్టర్లు, రికార్డులను పరిశీలించి రూ పొందించాలన్నారు. స్కానింగ్ సెంటర్లలో తాగునీరు, మూత్రశాలలు ఉండాలని, ధరల పట్టిక, ఐ ఈసీ, సమాచార సూచికలు, వేచి ఉండే గది అందుబాటులో ఉండాలన్నారు. అర్హత లేని వారు స్కానింగ్‌కు రిఫర్ చేయొద్దని, రేడియాలాజిస్ట్, గైనకాలజిస్ట్ లేకుండా స్కానింగ్ సెంటర్లను నిర్వ హించే వారిపై చట్ట ప్రకారం చర్యలుంటాయని స్పష్టం చేశారు. కొత్తగా రెండు స్కానింగ్ సెంటర్లకు అనుమతులివ్వడంతోపాటు నాలుగు సెంటర్లకు రెన్యువల్ చేసినట్లు తెలిపారు. ఆర్మూర్ డివిజన్‌లో ఓ స్కానింగ్ కేంద్రాన్ని మూసివేయాలని సభ్యులు తీర్మానం చేశారు. సమావేశంలో పీవో పీసీఎన్‌డీటీ డాక్టర్ సుప్రియ, పీవో ఎంసీహెచ్ డాక్టర్ శ్వేత, సభ్యులు పాల్గొన్నారు.
మూడు నెలలకోసారి
తనిఖీలు చేయాలి
అర్హత లేకుండా స్కానింగ్‌కు
రిఫర్ చేయొద్దు
డీఎంహెచ్‌వో రాజశ్రీ