
ఉద్యమకారుల నుంచి ప్రజాసేవకులుగా..
మోర్తాడ్(బాల్కొండ): తెలంగాణ విముక్తి ఉద్యమంలో పాలుపంచుకున్న ఉద్యమకారులు తరువాత రాజకీయాల్లో చేరి ఉన్నత పదవులను అలంకరించారు. మోర్తాడ్ మండలం సుంకెట్‌కు చెందిన నారాయణరెడ్డి ఎంపీగా, ఎమ్మెల్యేగా జిల్లా అభివృద్ధికి ఎంతో కృషి చేశారు. జక్రాన్‌పల్లి మండలం అర్గుల్‌కు చెందిన అర్గుల్ రాజారాం బాల్కొండ నియోజకవర్గానికి నాలుగుమార్లు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించడంతో పాటు చేనేత, ఆర్థిక, విద్యుత్ శాఖ మంత్రిగా విశిష్టమైన సేవలు అందించారు. చౌట్‌పల్లికి చెందిన హన్మంత్‌రెడ్డి జిల్లా పరిషత్ మొట్టమొదటి చైర్మన్‌గా ఎంపికై ప్రజాసేవలో కొనసాగారు. వీరితోపాటు అనేక మంది తమ సొంత గ్రామాలలో సర్పంచ్‌లుగా, సహకార సంఘాల చైర్మన్‌లుగా ఎంపికై ప్రజలకు విశేషమైన సేవలు అందించారు.

ఉద్యమకారుల నుంచి ప్రజాసేవకులుగా..