
పెద్దమల్లారెడ్డిలో యువకుడి ఆత్మహత్య
భిక్కనూరు: మండలంలోని పెద్దమల్లారెడ్డి గ్రామంలో ఓ యువకుడు ఆత్మహత్య చేసు కున్నట్లు భిక్కనూరు పోలీసులు తెలిపారు. వివరాలు ఇలా.. గ్రామానికి చెందిన ఎల్క తిరుపతి (20) గత కొన్నేళ్లుగా తాగుడుకు బానిసయ్యాడు. గతంలో అమ్మాయిలను వేధించిన కేసులో నిందితుడిగా ఉన్నాడు. ఈక్రమంలో సోమవారం రాత్రి అతడు డబ్బులు కావాలని తల్లి రామవ్వపై ఒత్తిడి చేశాడు. ఆమె డబ్బులు లేవని చెప్పడంతో, అతడు ఇంటికి వెళ్తున్నానని చెప్పి దూలానికి ఉరి వేసుకున్నాడు. మంగళవారం ఉదయం ఉరి వేసుకున్న కొడుకును చూసి తల్లి రోదించింది. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. హెడ్‌కానిస్టెబుల్ అంజయ్య ఘటన స్థలానికి చేరు కుని పంచనామా నిర్వహించి కేసు నమోదు చేసు కున్నారు. మృతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం కామారెడ్డి ఆస్పత్రికి తరలించారు.