
‘ప్రజాపాలన’ వేడుకలకు ముస్తాబైన కలెక్టరేట్
నిజామాబాద్‌నాగారం: నగరంలోని కలెక్టరేట్ నేడు నిర్వహించనున్న ప్రజాపాలన దినోత్సవానికి ముస్తాబైంది. ఏర్పాట్లను కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి, పోలీస్ కమిషనర్ సాయి చైతన్య మంగళవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్‌రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి, ఉదయం 10.00 గంటలకు త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించి, పోలీసుల గౌరవ వందనం స్వీకరించనున్నారు. ప్రజాప్రతినిధులు, పుర ప్రముఖులు విచ్చేయనున్న నేపథ్యంలో ఎలాంటి లోటుపాట్లకు తావులేకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేశారు.