
ఆలయంలో చోరీ
గాంధారి(ఎల్లారెడ్డి): మండల కేంద్రం శివారులోని గుట్టమీద గల శివభక్త మార్కండేయ ఆలయంలో చోరీ జరిగినట్లు ఎస్సై ఆంజనేయులు తెలిపారు. ఆలయంలోని హుండీని సోమవారం రాత్రి గుర్తుతెలియని దుండగుడు ఆలయ ఆవరణలో పగులగొట్టి డబ్బులు దొంగిలించినట్లు సీసీ కెమెరాలో రికార్డు అయినట్లు పేర్కొన్నారు. ఆలయ కమిటీ సభ్యుడు ఆశోక్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. అలాగే మండల కేంద్రంలో ఇంటి ముందర నిలిపిన బైక్‌ను గుర్తుతెలియని వ్యక్తులు అపహరించినట్లు ఎస్సై తెలిపారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
జక్రాన్‌పల్లి: బైక్ చోరి కేసులో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్సై మాలిక్ రెహమాన్ తెలిపారు. జక్రాన్‌పల్లి పోలీస్ స్టేషన్‌లో మంగళవారం ఆయన వివరాలు వెల్లడించారు. మండలంలోని గాంధీనగర్ వద్ద పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించగా, వారిని పట్టుకుని విచారించారు. వారి వద్దనున్న బైక్‌ను గత నెల 18న జక్రాన్‌పల్లి బస్టాండ్ వద్ద నుంచి చోరీ చేసినట్లు తెలిపారు. అనంతరం ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించామన్నారు.
నిజాంసాగర్(జుక్కల్): నిజాంసాగర్ ప్రాజెక్టుకు ది గువన ఉన్న నాగమడుగు లోలెవల్ వంతెన వద్ద వర ద నీటిలో ఒకరు గల్లంతయ్యారు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలు ఇలా.. ఎల్లారెడ్డి మండలం వెల్లుట్ల గ్రామానికి చెందిన చాకలి ప్రవీణ్ (30) మంగళవారం అచ్చంపేట గ్రామంలోని బంధువుల వద్దకు వెళ్లాడు. సాయంత్రం తిరిగి వస్తుండగా నాగమడుగు వద్ద వరద నీరు ఉధృతంగా ఉండటంతో ఈత కొట్టాడు. దీంతో అతడు నీటమునిగి గల్లంతయ్యాడు. సమాచారం అందుకున్న రెవెన్యూ, పోలీస్ అధికారులు వెంటనే అగ్నిమాపక సిబ్బందిని రప్పించారు. వరద నీటిలో రాత్రి వరకు గాలించారు. అయినా అతడి ఆచూకీ లభించలేదు.
నిజామాబాద్ రూరల్: మండలంలోని గుండారం గ్రామంలో 600 గ్రాములు నిషేదిత అల్ప్రాజోలంను నార్కోటిక్ అధికారులు పట్టుకున్నట్లు రూరల్ ఎస్‌హెచ్ మహ్మద్ ఆరీఫ్ మంగళవారం తెలిపారు. విశ్వసనీయ సమాచారం రావడంతో గుండారం కల్లు బట్టిపై దాడి చేసి అల్ప్రాజోలంను పట్టుకున్నట్లు తెలిపారు. నిందితులైన అశోక్, రమేశ్ గౌడ్‌లపై కేసు నమోదు చేసినట్లు వివరించారు.
మాచారెడ్డి: మండలంలోని ఘన్‌పూర్ శివారులో మంగళవారం ఓ భారీ ట్రక్కు టైర్ పంక్చర్ కావడంతో రోడ్డుపై నిలిచిపోయింది. దీంతో రోడ్డు కు ఇరువైపులా వాహనాలు గంటపాటు నిలిచిపోయాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారు. సమాచారం అందుకున్న మాచారెడ్డి పోలీసులు పొక్లెయిన్ సహాయంతో ట్రక్‌ను తొలగించి, ట్రాఫిక్ సమస్యను పరిష్కరించారు.

ఆలయంలో చోరీ

ఆలయంలో చోరీ

ఆలయంలో చోరీ