
నగరంలో గుర్తుతెలియని వ్యక్తి..
ఖలీల్‌వాడి: నగరంలోని బస్‌డిపో–1 ప్రహరీ వద్ద గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందినట్లు ఎస్‌హెచ్‌వో రఘుపతి మంగళవారం తెలిపారు. ఈనెల 14న ఉదయం సదరు వ్యక్తి అపస్మారకస్థితిలో ఉండటంతో స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. వారు వెంటనే అతడిని చికిత్స నిమ్తిం జీజీహెచ్‌కు తరలించారు. కానీ వైద్యులు పరిశీలించి మృతి చెందినట్లు తెలిపారు. మృతుడు వద్ద ఎలాంటి ఆధారలు లభించలేవని, అతడు బూడిద రంగు షర్టు, నలుపు రంగు ప్యాంటు ధరించాడని పోలీసులు తెలిపారు. మృతుడు భిక్షాటన చేసుకునే వ్యక్తిగా కనపడుతున్నట్లు చెప్పారు. ఎవరికై నా అతడి వివరాలు తెలిస్తే వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో సంప్రదించాలన్నారు.