
తాళ్లరాంపూర్‌లో ఉద్రిక్తత
మోర్తాడ్(బాల్కొండ): గ్రామస్తులు, గీత కార్మికుల మధ్య నెలకొన్న వివాదంతో ఏర్గట్ల మండలం తాళ్లరాంపూర్‌లో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. సోమవారం ఓ వ్యక్తి తన ఇంటి స్థలంలోని ఈత చెట్టును నరికేయగా దీనిపై గీత కార్మికులు ఎకై ్సజ్ అధికారులకు ఫిర్యాదు చేయడంతో వివాదం ముదిరింది. గతంలోనే తాటి చెట్లను గీసే విషయంలో గ్రామంలోని కొన్ని కుల సంఘాలు, గీత కార్మికులు రెండు వర్గాలుగా విడిపోయారు. ఈ అంశంపై గ్రామంలో న్యా య సేవాధికార సంస్థ అవగాహన సమావేశాన్ని నిర్వహించి గ్రామాభివృద్ధి కమిటీ రద్దు చేసేలా కృషి చేసింది. గ్రామాభివృద్ధి కమిటీ రద్దు చేసినట్లు ప్రకటించినా గ్రామంలోని రెండు వర్గాల మధ్య సఖ్యత కుదరలేదు. సోమవారం రా త్రి నుంచి ఈనెల 21 వరకు 163 సెక్షన్ అమలు చేస్తూ తహసీల్దార్ మల్లయ్య ఉత్తర్వులు జారీ చేశా రు. గ్రామంలో పోలీసు బలగాలు మోహరించాయి. ప్రజలు ఇళ్ల నుంచి బయటికి రావడం లేదు. రోడ్లు, వీధులు నిర్మానుష్యంగా మారాయి. ఆర్మూర్ ఏసీపీ వెంకటేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో ఆయా స్టేషన్‌ల ఎస్సైలు, ప్రత్యేక పోలీసు బలగాలు గ్రామంలో పికెటింగ్ నిర్వహించారు.
పోలీసుల తీరుపై నిరసన
బీడీ కంపెనీలో పనికి వెళ్లేందుకు ఇంటి నుంచి బయటికి వచ్చిన ఆడెపు లక్ష్మి అనే మహిళతోపాటు ఆమె భర్త నర్సయ్యపై పోలీసులు దాడి చేశారని తా ళ ్లరాంపూర్ గ్రామస్తులు అంటున్నారు. పోలీసుల తీరుపై అభ్యంతరం వ్యక్తం చేసిన బోనగిరి లావ ణ్యను పోలీసులు తమ వాహనంలో ఎక్కించుకుని తీసుకవెళ్తుండగా ఆమె తీవ్రంగా ప్రతిఘటించడంతో చివరకు వదిలేశారన్నారు. పోలీసులు తమపై అకారణంగా దాడులు చేస్తున్నారని కొందరు ఫొటో లు తీసి సీపీ సాయి చైతన్యకు సామాజిక మా ధ్య మాల ద్వారా చేరవేయడంతో ఎవరిపై దాడికి పాల్పడవద్దని ఆ యన ఆదేశించినట్లు తెలిసింది. తాళ్లరాంపూర్‌లో చోటు చేసుకున్న వివాదంపై ఆర్మూర్ సబ్ కలెక్టర్ అభిగ్వాన్ మాల్వియా, అదన పు పోలీసు కమిషనర్ బస్వారెడ్డి మోర్తాడ్‌లో ఇరువర్గాలతో చర్చలు నిర్వహించారు. అధికారులు ఈనెల 19న మరోసారి చర్చలు నిర్వహించి సమస్యను పరిష్కరిస్తామని వెల్లడించారు.
గ్రామస్తులు, గీత కార్మికుల మధ్య ముదిరిన వివాదం
ఈ నెల 21 వరకు 163 సెక్షన్ విధిస్తూ ఉత్తర్వులు జారీ
భారీగా మోహరించిన పోలీసు బలగాలు