
పరిమితులు లేకుండా పరిహారం అందించాలి
నిజామాబాద్‌నాగారం: వరద కారణంగా నష్టపోయిన వారికి పరిమితులు లేకుండా పరిహారం అందించాలని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు వడ్డి మోహన్‌రెడ్డి కోరారు. వరద వల్ల పంటలు నష్టపోయిన రైతులతో కలిసి మంగళవారం ఆయన కలెక్టరేట్ ఎదుట నిరసన తెలిపి కలెక్టర్ వినయ్‌కృష్ణారెడ్డికి వినతిపత్రం అందజేశారు. మోహన్‌రెడ్డి మాట్లాడుతూ.. ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదల కారణంగా శ్రీరామ్‌సాగర్ ప్రాజెక్ట్ బ్యాక్ వాటర్‌ప్రాంతంలో పంటలకు తీవ్ర నష్టం వాటిల్లిందని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లామన్నారు.
బాధితులకు పరిహారం అందించని పక్షంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతామన్నారు. జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ కూరెళ్ల శ్రీధర్, బోధన్ రూరల్ మండల అధ్యక్షుడు సిర్ప సుదర్శన్, బోధన్ పట్టణ అధ్యక్షుడు గోపికిషన్, సాలూర మండల అధ్యక్షుడు గంగాధర్, బోధన్ రూరల్ మండల మాజీ అధ్యక్షుడు రాజు మనోహర్, బోధన్ నియోజకవర్గంలోని బీజేపీ నాయకులు, రైతులు, ప్రజలు పాల్గొన్నారు.