ప్లాస్టిక్‌ నిరోధానికి స్టీల్‌ బ్యాంకులు | - | Sakshi
Sakshi News home page

ప్లాస్టిక్‌ నిరోధానికి స్టీల్‌ బ్యాంకులు

Sep 16 2025 8:25 AM | Updated on Sep 16 2025 8:25 AM

ప్లాస

ప్లాస్టిక్‌ నిరోధానికి స్టీల్‌ బ్యాంకులు

ప్లాస్టిక్‌ నిరోధానికి స్టీల్‌ బ్యాంకులు

ప్లాస్టిక్‌ను నియంత్రించేందుకే..

అన్నదానాలకు ఇస్తున్నాం

రెంజల్‌, తాడ్‌బిలోలి గ్రామాల్లో శ్రీకారం

స్టీల్‌ ప్లేట్లను వినియోగిస్తున్న గ్రామస్తులు

రెంజల్‌(బోధన్‌): పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్లాస్టిక్‌ భూతాన్ని తరిమేందుకు గ్రామాల్లో స్టీల్‌ బ్యాంకులు ఏర్పాటవుతున్నాయి. శుభకార్యాలు, అన్నదానాల్లో సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ ప్లేట్లలో భోజనాలు చేస్తుండడంతో అనారోగ్య సమస్యలు దరి చేరుతాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ వాడాకాన్ని తగ్గించాలనే ఆలోచనతో రెంజల్‌ మండల కేంద్రంలో శివాజీ సేవా సమితి, తాడ్‌బిలోలి గ్రామంలో శ్రీరామాలయం కమిటీలు స్టీల్‌ బ్యాంకులను ఏర్పాటు చేశాయి. ఈ రెండు గ్రామాల్లో జరిగే శుభకార్యాలు, పెళ్లిళ్లలో సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ను తగ్గించే దిశగా కమిటీలు ముందుకెళ్తున్నాయి. ప్లాస్టిక్‌ ప్లేట్లకు బదులు స్టీల్‌ ప్లేట్లను వాడేలా కృషి చేస్తున్నాయి.

భయపెడుతున్న ప్లాస్టిక్‌ భూతం

జిల్లాలో ప్లాస్టిక్‌ భూతం భయపెడుతోంది. నిషేధిత సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ను యథేచ్ఛగా వినియోగిస్తున్నారు. 120 మైక్రాన్‌లలోపు కవర్లు, గ్లాసుల నిషేధం అమలుకు నోచడంలేదు. 2022 జూలై నుంచి ప్లాస్టిక్‌ను నిషేధిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. కానీ, వ్యాపారులు, ప్రజలు నిబంధనలు పాటించడం లేదు. మరోవైపు ప్లాస్టిక్‌ నిషేధాన్ని అమలు చేయాల్సిన అధికారులు పట్టించుకోవడం లేదు. సూపర్‌ మార్కెట్లు, టిఫిన్‌ సెంటర్లు, కూరగాయల మార్కెట్లు, హోటల్స్‌, పానీపూరి, చిరు వ్యాపారులు, వైన్స్‌ల వద్ద పర్మిట్‌ రూంలు, స్వీట్‌ షాపులు, పండ్ల దుకాణాల తదితర వాటిల్లో తక్కువ మైక్రాన్ల కవర్లను వినియోగిస్తున్నారు. వాటిని వినియోగించే ప్రజలు రోగాలబారిన పడే ప్రమాదం ఉంది. ప్లాస్టిక్‌ కవర్లు విక్రయించే వారికి భారీ మొత్తంలో జరిమానాలు విధించే అవకాశం ఉన్నా, అధికారులు ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలు వస్తున్నాయి.

ప్లాస్టిక్‌ ప్లేట్లు, గ్లాసుల వాడకాన్ని నియంత్రించేందుకు శివాజీ సేవా సమితి ఆధ్వర్యంలో 300 స్టీల్‌ ప్లేట్లు, గ్లాసులు తీసుకొచ్చాం. శుభకార్యాలకు ఉచితంగా అందిస్తున్నాం. స్టీల్‌ బ్యాంకు ప్లేట్లు, గ్లాసులు తీసుకున్న వారు చార్జీలు కాకుండా మరిన్ని స్టీల్‌ ప్లేట్లు అందించాలని సూచిస్తున్నాం. ఎవరినీ బలవంతం చేయడం లేదు.

– లక్ష్మణ్‌గౌడ్‌, రెంజల్‌ శివాజీ సేవా సమితి ప్రతినిధి

ప్లాస్టిక్‌ వాడకంతో కలిగే అనర్థాలను గుర్తించి ఇటీవల ఆలయ కమిటీ ద్వారా 800 స్టీల్‌ ప్లేట్లు, గ్లాసులు తెప్పించాం. కేవలం ఆలయాల్లో నిర్వహించే అన్నదానాలకు ఉచితంగా అందిస్తున్నాం.

– కార్ఖానా శ్రీనివాస్‌, శ్రీరామాలయం కమిటీ చైర్మన్‌, తాడ్‌బిలోలి

ప్లాస్టిక్‌ నిరోధానికి స్టీల్‌ బ్యాంకులు1
1/3

ప్లాస్టిక్‌ నిరోధానికి స్టీల్‌ బ్యాంకులు

ప్లాస్టిక్‌ నిరోధానికి స్టీల్‌ బ్యాంకులు2
2/3

ప్లాస్టిక్‌ నిరోధానికి స్టీల్‌ బ్యాంకులు

ప్లాస్టిక్‌ నిరోధానికి స్టీల్‌ బ్యాంకులు3
3/3

ప్లాస్టిక్‌ నిరోధానికి స్టీల్‌ బ్యాంకులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement