
దౌర్జన్యం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలి
తోటలకు వెళ్లేందుకు దారి కోసం తమ భూమి ఇవ్వాలని కొందరు వ్యక్తులు ఇబ్బంది పెడుతున్నారని బాల్కొండ మండలం వన్నెల(బి) గ్రామానికి చెందిన కొందరు గ్రామస్తులు కలెక్టరేట్ ఎదుట నిరసన తెలిపారు. తమ భూమిలో నుంచి ఇతర కులస్తులు దారి తీసుకునేందుకు దౌర్జన్యం చేస్తున్నారని పేర్కొన్నారు. విచారణ చేపట్టి తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
వేతనాలు చెల్లించండి
రెండు నెలల వేతనాలను చెల్లించాలని తెలంగాణ ప్రగతిశీల గ్రామపంచాయతీ వర్కర్స్ యూనియన్ నాయకులు, పారిశుద్ధ్య కార్మికులు కలెక్టరేట్ ఎదుట నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సంఘం ఉమ్మడి జిల్లా సంయుక్త కార్యదర్శి రమేశ్ మాట్లాడుతూ రెండు నెలల నుంచి వేతనాలు చెల్లించడం లేదని పేర్కొన్నారు.