
ఫోన్‌మిత్ర.. తల్లిదండ్రులకు నిశ్చింత
ఆర్మూర్ టౌన్: ఇంటికి దూరంగా ఉంటూ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల/ కళాశాలలో చదివే వి ద్యార్థుల బెంగ తీరింది. తల్లిదండ్రులకు తమ పిల్ల లు ఎలా ఉన్నారన్న ఆందోళనా పోయింది. రాష్ట్ర ప్రభుత్వం సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాసంస్థల్లో ‘ఫోన్ మిత్ర’ కార్యక్రమం ప్రారంభించింది. జిల్లాలోని తొమ్మిది సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల, కళాశాలల్లో ఫోన్ మిత్ర సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. దీంతో తల్లిదండ్రులు, విద్యార్థులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
విద్యార్థుల సంఖ్యకు సరిపడా బాక్సులు..
జిల్లాలో ఆరు బాలికల, మూడు బాలుర సాంఘిక సంక్షేమ పాఠశాలలు, కళాశాలలు, సుమారు 5,500 మంది విద్యార్థులు చదువుతున్నారు. ‘ఫోన్ మి త్ర’ లో భాగంగా విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఫోన్ బాక్సులను ఏర్పాటు చేశారు. ఈ ఫోన్ల నుంచి తల్లిదండ్రులు, సంరక్షకులకు మాత్రమే కాల్స్ వెళ్లే లా స్మార్ట్‌కార్డులను తయారు చేశారు. స్మార్ట్ కార్డు ను ఫోన్ బాక్స్‌లో స్వైప్ చేసి విద్యారులు తమకు ఇచ్చిన సంఖ్యను నొక్కితే నేరుగా తల్లిదండ్రులకు కాల్ వెళ్తుంది. గురుకులంలో ఉన్న సమస్యలు, ఇ బ్బందులను నేరుగా అధికారులు, సొసైటీ కార్యాలయానికి తెలిపేందుకు ఇతర అంకెలను ఫోన్‌బాక్సులో పొందుపర్చారు. నలుగురు విద్యార్థులకో స్మార్ట్ కార్డును అందజేశారు. రోజులో 25 నిమిషా లపాటు మాట్లాడే వీలు కల్పించారు. దీంతో సులభంగా యోగక్షేమాలు తెలుసుకునే అవకాశం ఏర్పడింది. కాగా, ఇంటికి దూరంగా ఉన్న పిల్లల్లో మానసిక స్థైర్యం పెరుగుదలకు ఫోన్‌మిత్ర దోహదపడుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ఫోన్‌బాక్స్ ద్వారా తమ తల్లిదండ్రులతో మాట్లాడుతున్న విద్యార్థులు
ఎస్సీ గురుకులాల్లో ఫోన్ బాక్సులు
తల్లిదండ్రులతో మాట్లాడే వెసులుబాటు
పిల్లల్లో మానసిక స్థైర్యం
పెంపునకు దోహదం
ఆరు ఫోన్‌ల ఏర్పాటు
ఈ నెల మొదటివారంలో ‘ఫోన్‌మిత్ర’ ప్రారంభమైంది. 6 ఫోన్ బాక్సులు ఏర్పాటు చేశారు. ఫోన్ మిత్ర ద్వారా విద్యార్థులు తల్లిదండ్రులతో మాట్లాడుతున్నారు. బాగో గులు తెలుసుకుంటున్నారు.
– జి.సుదర్శన్, ప్రిన్సిపల్, ఎస్సీ గురుకుల బాలుర పాఠశాల, వేల్పూర్
సంతోషంగా ఉంది..
‘ఫోన్‌మిత్ర’ ద్వారా తలిదండ్రులతో మా ట్లాడటం సంతోషంగా ఉంది. గతంలో టీచర్లు, ఇతర విద్యార్థుల తల్లిదండ్రు ల ఫోన్లతో కుటుంబసభ్యులతో మాట్లాడేవాళ్లం. ఇప్పుడు రోజూ మాట్లాడే అవకాశం కల్పించారు. – రాజు, విద్యార్థి