డెంగీ పంజా.. | - | Sakshi
Sakshi News home page

డెంగీ పంజా..

Jul 22 2025 8:59 AM | Updated on Jul 22 2025 9:31 AM

నిజామాబాద్‌

వే బిల్లు లేకుండా..

వే బిల్లు లేకుండా సరుకు రవాణా చేస్తున్న ట్రక్కును వాణిజ్య పన్నుల శాఖ అధికారులు పట్టుకుని డిచ్‌పల్లి పోలీస్‌ స్టేషన్‌లో ఉంచారు.

మంగళవారం శ్రీ 22 శ్రీ జూలై శ్రీ 2025

– 8లో u

జిల్లాలో విజృంభిస్తున్న విష జ్వరాలు

హైరిస్క్‌ పీహెచ్‌సీలుగా ముదక్‌పల్లి,

పోతంగల్‌, మోస్రా గుర్తింపు

ప్రత్యేక వైద్య శిబిరాల ద్వారా అవగాహన, చికిత్సలు

నిజామాబాద్‌ నాగారం: జిల్లాలో విష జ్వరాలు విజృంభిస్తున్నాయి. డెంగీ కేసులు పెరుగుతున్నాయి. వైద్యశాఖ అధికారులు ఫీవర్‌ సర్వే చేపడుతూ బాధితులను గుర్తించి చికిత్స అందిస్తున్నారు. ఎక్కడైనా డెంగీ పాజిటివ్‌ ఉంటే చుట్టూ 100 కుటుంబాల్లో ప్రత్యేక సర్వేతో పాటు, ఆరోగ్య అవగాహన శిబిరాలు ఏర్పాటు చేసి చికిత్స అందిస్తున్నారు. అయినా కొన్ని పీహెచ్‌సీ, గ్రామాల పరిధిలో డెంగీ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి.

పెరుగుతున్న కేసులు..

జిల్లాలోని 27 పీహెచ్‌సీలు, 7 సీహెచ్‌సీ, 10 అర్బన్‌ హెల్త్‌ సెంటర్లు, ఆర్మూర్‌ ఏరియా ఆస్పత్రి, బోధన్‌ జిల్లా ఆస్పత్రితో పాటు ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రిలో క్రమంగా వైరల్‌ ఫీవర్‌తోపాటు డెంగీ కేసులు పెరుగుతున్నాయి. చిన్నాపెద్ద తేడా లేకుండా జ్వరం, దగ్గు, జలుబుతో బాధపడుతున్నారు. వాతావరణంలో వచ్చిన మార్పులతో ప్రతి ఇంట్లో ఒకరు జ్వర బాధితులున్నారు. ముఖ్యంగా వైరల్‌ ఫీవర్‌తో బాధపడే వారి సంఖ్య ఎక్కువైంది. దీనికి తోడు డెంగీ పంజా విసురుతోంది. జ్వరం రెండు, మూడు రోజులుగా తగ్గకపోవడంతో టెస్టులు చేస్తే డెంగీ కేసులుగా నమోదు అవుతున్నాయి.

‘ప్రయివేట్‌’ దోపిడీ..

జిల్లాలోని పలు ప్రయివేట్‌ ఆస్పత్రుల్లో నిబంధనలకు విరుద్ధంగా డెంగీ ర్యాపిడ్‌ టెస్టులు చేస్తున్నారు. డెంగీ అనేది కేవలం ఎలీసా టెస్ట్‌ ద్వారానే నిర్ధారణ అవుతుంది. ఎలీసా టెస్ట్‌ కేవలం జీజీహెచ్‌ ఆవరణలోని టీ–హబ్‌లో మాత్రమే ఉంది. కానీ ప్రయివేట్‌ ఆస్పత్రులు కేవలం డబ్బులు దండుకోవడానికే ర్యాపిడ్‌ టెస్టులు చేస్తున్నారు. డెంగీ పాజిటివ్‌ వచ్చినట్లు చూపి రోగులను అడ్మిట్‌ చేసుకొని చికిత్స అందిస్తున్నారు.

న్యూస్‌రీల్‌

హైరిస్క్‌

పీహెచ్‌సీలు..

జిల్లాలో డెంగీ కేసులు పెరుగుతున్న దృష్ట్యా కేసులున్న గ్రామాలను హైరిస్క్‌ పీహెచ్‌సీలుగా గుర్తించి ప్రత్యేక చికిత్స అందిస్తారు. ప్రస్తుతం జిల్లాలో ముదక్‌పల్లి, పోతంగల్‌, మోస్రా, నగరంలోని చంద్రశేఖర్‌కాలనీ పీహెచ్‌సీల పరిధిలో డెంగీ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. ఒక్క మోపాల్‌ మండలంలోని ముదక్‌పల్లి పీహెచ్‌సీ పరిధిలో జూన్‌లో 07, జూలైలో 09, పోతంగల్‌ పరిధిలో జూన్‌లో 2, జూలైలో 5, మోస్రా పరిధిలో జూన్‌లో 3, జూలైలో 03, నగరంలోని చంద్రశేఖర్‌కాలనీ పరిధిలో జూలైలో 4 కేసులు నమోదు అయ్యాయి. ముదక్‌పల్లి పీహెచ్‌ పరిధిలోని కాల్పోల్‌ గ్రామంలో 7 డెంగీ కేసులు నమోదు కావడం మరింత కలవర పెడుతోంది. జిల్లాలో ఎక్కడ డెంగీ పాజిటివ్‌ కేసులు నమోదైనా వెంటనే వైద్యారోగ్యశాఖ అధికారులు ప్రత్యేకంగా ఆరోగ్య శిబిరాలు ఏర్పాటు చేస్తున్నారు. ప్రజలకు అవసరమైన పరీక్షలు చేసి మందులు ఇస్తున్నామని చెబుతున్నారు.

చర్యలు తీసుకుంటున్నాం..

జిల్లాలో గత నెలతో పోలిస్తే ఈ నెలలో డెంగీ పాజిటివ్‌ కేసులు పెరిగాయి. ఎక్కడ డెంగీ నమోదు అయినా ఆ ప్రాంతంలో ప్రత్యేక సర్వేతో పాటు ఆరోగ్య శిబిరాలు నిర్వహిస్తున్నాం. ప్రయివేట్‌ ఆస్పత్రుల్లో డెంగీ ర్యాపిడ్‌ టెస్ట్‌ చేసి డెంగీ పేరుతో చికిత్స చేస్తున్నట్లు తెలిసినా, ఫిర్యాదులు వచ్చినా చర్యలు ఉంటాయి. టీహబ్‌లో మాత్రమే ఎలీసా టెస్ట్‌ ద్వారా డెంగీ పాజిటివ్‌ నిర్ధారణ అవుతుంది. ప్రజలు కూడా అవగాహనతో ఉండి ప్రశ్నించాలి. ఎప్పటికప్పుడు తనిఖీలు చేయిస్తున్నాం. వైద్య సిబ్బంది అందరూ ప్రజలకు అందుబాటులో ఉండాల్సిందే.

– డాక్టర్‌ రాజశ్రీ, డీఎంహెచ్‌వో, నిజామాబాద్‌

డెంగీ పంజా..1
1/4

డెంగీ పంజా..

డెంగీ పంజా..2
2/4

డెంగీ పంజా..

డెంగీ పంజా..3
3/4

డెంగీ పంజా..

డెంగీ పంజా..4
4/4

డెంగీ పంజా..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement