
ప్రశాంత్‌రెడ్డి.. దమ్ముంటే చర్చకు రావాలి
నిజామాబాద్ సిటీ: కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్‌రెడ్డిపై నిత్యం అసత్య ప్ర చారాలు చేస్తున్న మాజీ మంత్రి ప్రశాంత్‌రెడ్డికి కనువిప్పు కలిగిస్తామంటే హైదరాబాద్‌లో దాక్కున్నాడ ని, వేల్పూర్ రాకుండా పారిపోయాడని డీసీసీ అధ్యక్షుడు, రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి మండిపడ్డారు. జిల్లా కేంద్రంలోని ఆయన నివాసంలో గురువారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. బీఆర్‌ఎస్ నాయకులకు అధికారం కోల్పోయిన తర్వాత సోయి తప్పిందని, కేటీఆర్, హరీశ్ రావుతోపాటు ప్రశాంత్‌రెడ్డి కూడా మతి తప్పి మాట్లాడుతున్నారని అన్నారు. మాజీ మంత్రి కేటీఆర్ రాష్ట్ర ప్రభుత్వాన్ని అవమానిస్తూ, ప్రజలను తప్పు దోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారన్నారు. శాంతియుతంగా జరిపే కార్య క్రమంలో పా ల్గొనకుండా పోలీసులు తనను అడ్డుకోవడం ఏమిటని ప్రశ్నించారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగా నే ఎన్నారై సె ల్ ఏర్పాటు చేసి 55 మందికి ఒక్కొక్కరికి రూ.5 లక్షల పరిహారం అందించామని, కేవలం బాల్కొండ నియోజకవర్గంలోనే 18 మందికి పరిహారం ఇప్పించామని గుర్తుచేశారు. కాంగ్రెస్ నాయకులు కేతావత్ యాదగిరి, బోర్గం శ్రీనివాస్, గడుగు రోహిత్, వేణురాజ్, పంచరెడ్డి చరణ్, ప్రీతం పాల్గొన్నారు.
సవాల్ విసిరితే పట్నంలో దాక్కున్నాడు
డీసీసీ అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి